Home » మీ మెదడును చదివే సూపర్ హెడ్సెట్.. భవిష్యత్తులో మౌస్, కీబోర్డులతో పనిలేనట్టే!
Published
2 months agoon
By
sreehariకంప్యూటర్ కంటే వేగంగా పనిచేయగలదు మనిషి మెదడు.. మెదడులోని మెమెరీ సామర్థ్యం లెక్కించలేనిది.. సూపర్ కంప్యూటర్ కంటే మెదడు ఎంతో పవర్ ఫుల్ కూడా.
అలాంటి మెదడులోని ఆలోచనలు, పనితీరును మానిటర్ చేయడం సాధ్యమేనా? అంటే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ స్టార్టప్ OpenBCI కంపెనీ సహా వ్యవస్థాపకుడు Conor Russomanno సాధ్యమే అంటున్నారు.
మెదడును నియంత్రించగల సామర్థ్యం తాను కనిపెట్టిన హెడ్సెట్లో ఉందంటున్నారు. అదే.. Galea సూపర్ హెడ్ సెట్.. మనిషి ఆలోచనలను ఇట్టే పసిగట్టేయగలదు.
అంతేకాదు.. భవిష్యత్తులో ఈ హెడ్ సెట్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ ద్వారా మనిషి మెదడును కంట్రోల్ చేయనుంది. మనస్సుకు, మెదడుకు మధ్య వ్యత్యాస్యాన్ని కంప్యూటింగ్ చేయగలదు.
కానర్ Russomanno ఈ మైండ్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ రూపొందించాలనే ఆలోచనకు కారణం ఉందంటున్నారు. తాను ఈ ప్రాజెక్టుపై ఎందుకింత సీరియస్ గా దృష్టిపెట్టాడో చెప్పుకొచ్చాడు. గతంలో తనకు మెదడుకు దెబ్బ తగిలింది. 2010లో కాలేజీలో ఫుట్ బాల్ ఆడే సమయంలో తలకు గాయమైంది.
అప్పటినుంచి తనకు స్టడింగ్, రీడింగ్ కష్టంగా ఉండేది. అప్పటి నుంచే తాను మెదడు, మనస్సుకు మధ్య తేడాను గుర్తించడం మొదలుపెట్టినట్టు చెప్పాడు.
మీ బ్రెయిన్ అనే హార్డ్ వేర్ దెబ్బతింటే.. మనస్సు అనే సాఫ్ట్వేర్ తో ఫీల్ అవ్వొచ్చు అంటున్నాడు. ఈ విషయంలో తాను ఎన్నోసార్లు సైకాలిజిస్టులకు దగ్గరకు వెళ్లాడు.
న్యూరాలాజిస్టుల దగ్గరకు వెళ్లాడు. అందరూ తనను పరీక్షించి అంతే బాగానే ఉందన్నారు. కానీ, తాను మాత్రం అలా ఫీల్ అవ్వడం లేదని చెప్పాడు.
కొన్ని రోజుల తర్వాత కోలుకున్న కానర్.. ఒక గ్రాడ్యుయేట్ స్కూళ్లో డిజైన్ అండ్ టెక్నాలజీ MFA ప్రొగ్రామ్‌లో చేరాడు. ఆ సమయంలోనే తాను ఫిజికల్ కంప్యూటింగ్ క్లాస్ ప్రాజెక్ట్ చేయమన్నారు.
అందుకోసం ఆన్ లైన్ ట్యూటోరియల్ చూశాడు. అందులో electroencephalography (EEG) టాయ్ నుంచి బ్రెయిన్ వేవ్స్ ఎలా హ్యాక్ చేయవచ్చో తెలుసుకున్నాడు.
ఇదొక ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్.. 2015లో బ్రూక్లెన్ ఆధారిత స్టార్టప్ కంపెనీ OpenBCIలో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాడు.
రీసెర్చర్ల కోసం 4 లక్షల డాలర్ల బడ్జెట్‌తో OpenBCI కంపెనీని స్థాపించాడు. అప్పుడే వర్చువల్ రియాల్టీ కంపాటబుల్ సెన్సార్ హెడ్ సెట్ కనిపెట్టాడు. దీనికి Galea అని పేరు పెట్టాడు. ఈ సూపర్ హెడ్ సెట్ 2021లో రిలీజ్ చేయనుండగా పొర్టబుల్ EEG హెడ్ సెట్లలో ఇదొకటి కానుంది.
కంప్యూటర్ ద్వారా ఎలక్ట్రికల్ యాక్టివిటీని మానిటర్ చేసేందుకు ఈ పోర్టబుల్ EEG హెడ్ సెట్లను వాడుతుంటారు. EEG హెడ్ సెట్ల ద్వారా కంప్యూటర్ తో నేరుగా ఇంటర్ ఫేస్ కావడం కొత్తమే కాదు. 1970 ఆరంభంలోనే జాక్వెస్ విడాల్ అనే ప్రొఫెసర్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్‌ను రూపొందించారు.
ఈ Galea సూపర్ హెడ్సెట్ ద్వారా ఒక మనిషిలోని సంతోషం, ఆందోళన, ఆసక్తి వంటి అనేక స్పందనలను రియల్ టైమ్‌లో మానిటర్ చేయొచ్చు.కంప్యూటర్లో వేర్వేరు డ్రైవర్లు, వేర్వేరు సాఫ్ట్ వేర్లు, వేర్వేరు హార్డ్ వేర్ సెటప్ ఉన్నట్టుగానే మనిషిలోనూ ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయి. ఇంట్లో ఏం జరుగుతుందో తెలియాలంటే కిటికిలు ఉంటే చాలు.
అలాగే మెదడులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇలాంటి సూపర్ హెడ్ సెట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు.ఈ హెడ్ సెట్ ఎవరైనా ధరిస్తే వారిలో సైకలాజికల్ గా లేదా మెదడు లేదా మనస్సు ఎలా మార్పు, ప్రేరణ చెందుతుందో గుర్తించవచ్చు. ఇందులో మల్టీపుల్ సెన్సార్లు ఉన్నాయి. ఈ హెడ్ సెట్ ధరిస్తేచాలు.
మనిషి మెదడులోని డేటాను సులభంగా రీడ్ చేయగలదు. ఒక్క బ్రెయిన్ మాత్రమే కాదు.. శరీరంలోని కళ్లు, గుండె, చర్మం, కండరాలు, అంతర్గత స్థితిని బయోలాజికల్ రెస్పాన్స్ కచ్చితంగా అంచనా వేయగలదు.
ఈ హెడ్ సెట్ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తు తరాల్లో కంప్యూటర్లన్నీ మౌస్, కీబోర్డుల అవసరం ఉండకపోవచ్చు. మనిషి బ్రెయిన్లోని ఆలోచనలతో కంప్యూటర్ ఆపరేటింగ్ చేయొచ్చు.