లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

మీ పేరు కమలా.. అయితే ఈ ఆఫర్‌ మీకే

Published

on

Indian Theme Park : అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారీస్‌ పేరు ఇండియాలో ఇంకా  ట్రెండ్‌ అవుతోంది. కమలా హరీస్‌ క్రేజ్‌ రోజురోజుకి పెరుగుతోంది. కమలా హ్యారీస్‌ సాధించిన అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది వండర్‌లా  అమ్యూజ్‌మెంట్‌ థీమ్‌ పార్క్‌. జనవరి 24న కమల అనే పేరు ఉన్న వారికి వండర్‌లా లో ఫ్రీగా ఎంట్రీ కల్పిస్తామని ప్రకటించింది.

కమల, కమ్లా, కమల్‌, కమలం ఇలా కమలకు దగ్గర పేరు ఉంటే చాలు ఎలాంటి రుసుము చెల్లించకుండానే వండర్‌లా పార్కులో ఈ ఆదివారం ప్రవేశించవచ్చు. అయితే పేరుతో కూడిన  ఫొటో ఐడీ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్‌లో ఉన్న వండర్‌లా థీమ్‌ పార్కులలో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. మొదట వచ్చిన 100 మందికి మాత్రమే ఆఫర్‌ వర్తిస్తుంది.

భారత- జమైకా సంతతికి చెందిన కమలా హారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా పదవి చేపట్టారు. ఆమె ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచీ ప్రమాణ స్వీకారం చేసే వరకు ప్రతీ అంశంలో భారతీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఆమె విజయాన్ని సెలబ్రేట్‌ చేసేందుకు ‘ఈ ఆదివారం అంతా కమల విజయమే!” అంటూ సదరు సంస్థ ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.