పానీపూరీ కావాలా నాయనా…వెండింగ్ మిషన్ లో రూ.20 నోటు పెట్టండి..గోల్ గప్పా ప్రత్యక్షం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా రాకాసితో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మానవత్వం కూడా మంటగలిసిపోతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో జనాలు భయపడిపోతున్నారు. ఎవరినన్నా ముట్టుకోవాలంటే జనాలు జంకుతున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ నోటికి కూడా తాళం పడింది.

ఏ హోటల్ కు వెళితే…కరోనా వస్తుందోమోనన్న భయం ఇంకా అందరిలో ఉంది. దీంతో కొంతమంది బుర్రకు పదును పెట్టి..కొత్త కొత్త మెషిన్లను అందుబాటులోకి తెస్తున్నారు. గుళ్లో గంట కొట్టడం, తీర్థం పెట్టే మిషన్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా…పానీ పూరీ వెండింగ్ మిషన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది.

Auto Pani Puri Center : –
సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ…పరిశుభ్రమైన పానీపూరీని తినే రోజులు వచ్చేశాయి. అవును ఓ మిషన్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. Auto Pani Puri Center ను ఏర్పాటు చేశారు. ఇది ఎలా పనిచేస్తుందో ఓ వ్యక్తి వివరించారు.

ఎలా పనిచేస్తుంది : – 
మొదట Start Button ప్రెస్ చేయాలి. వెంటనే ఎన్ని రూపాయలో (ఉదా. రూ. 20) ప్రెస్ చేయాలి. అనంతరం Enter Button నొక్కాలి. తర్వాత సేమ్ ATM లో క్యాష్ ఎలా వస్తుందో అలాగే కింద..బల్బు వెలుగుతున్న దగ్గర రూ. 20 నోటు పెట్టాలి. అమాతం..అది లోపలికి తీసుకుంటుంది. కొన్ని నిమిషాల అనంతరం ఎన్ని గప్ చుప్ లు వస్తాయో మెషిన్ పై చూపిస్తుంది.

ఆరు నెలల కష్టం : –
లెఫ్ట్ సైడ్ లో చిన్న డబ్బా సైజులో ఉన్న దగ్గర గప్ చుప్ లు ప్రత్యక్షం అవుతాయి. ఒక్కొటి లైన్ గా వెళుతుంటాయి..వెంటనే దానిని తీసుకోవడం నోట్లో వేసుకోవడమే. అస్సాంకు చెందిన ఓ వ్యక్తి దీనిని తయారు చేసినట్లు తెలుస్తోంది. సుమారు ఆరు నెలల పాటు కష్టపడి తయారు చేసినట్లుగా వెల్లడించాడు.

Read:ఈ మాస్క్ ధర అక్షరాల రూ.2లక్షల 89వేలు

Related Posts