COVID-19 వేవ్ కాదు.. ఇదో సునామీలా దూసుకొస్తుందంటున్న సైంటిస్టులు..!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కొవిడ్-19 అనేది ఒక వేవ్ కాదు.. సునామీ లాంటిందని హెచ్చరిస్తున్నాయి పలు అధ్యయనాలు. లాక్ డౌన్ ప్రణాళికబద్ధంగా అనుసరించినప్పుడే కరోనాను కట్టడి చేయడం సాధ్య పడుతుందని, లేదని నిర్లక్ష్యం వహిస్తే కరోనాకు బలైపోవాల్సిందేనని సైంటిస్టులు అంటున్నారు. అమెరికాలో 2.6 మిలియన్ల మంది కరోనావైరస్ బారిన పడ్డారు. 128,064 మంది మరణించారు. ఈ మహమ్మారి మొదటి వేవ్ అంతం కాలేదు. ఇప్పుడే అది సునామీగా మారిపోయింది.

లోతైన నీటిలో కేవలం అలలు మాదిరిగా అన్ని తీరప్రాంతాలను కరోనా ఒకే విధంగా ప్రభావం చూపదు. ఈ ప్రత్యేకమైన సునామి అనే కరోనా మహమ్మారి చైనాలోని భూకంప కేంద్రం నుంచి వినాశకరమైన తరంగాలతో కదిలి వివిధ దేశాలను వేర్వేరు సమయాల్లో తాకింది. న్యూజిలాండ్ వంటి కొన్ని దేశాలు ముందస్తు హెచ్చరికలను పట్టించుకోలేదు. అయినప్పటికీ తమ ప్రజల రక్షణ కోసం వేగంగా పనిచేశాయి. కానీ, అమెరికా అలా చేయలేదు. అందుకే తగని భారీ మూల్యం చెల్లించుకుంది. సరైన సమయంలో చర్యలు తీసుకోక పోతే ప్రాణనష్టం భారీగా చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
This isn’t a COVID-19 wave, it’s a tsunami

న్యూయార్క్‌లోనే భూగ్రహం మీద ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉందని భావిస్తున్నామని క్యూమో మార్చి 2న విలేకరుల సమావేశంలో అన్నారు. సునామీ నుండి బయటపడటం ముఖ్య సిద్ధాంతం ఒకటే.. సునామీలు వేగంగా కదులుతాయి.. మహమ్మారి కూడా అలానే విజృంభిస్తుంది. సునామీలా దూసుకొస్తున్న కరోనా మహహ్మారిని కట్టడి చేయడానికి లాక్ డౌన్ అనే గోడను అమర్చాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఒక వారం ముందే దేశాన్ని లాక్ డౌన్ చేస్తే.. 36,000 మంది ప్రాణాలు కాపాడవచ్చునని అన్నారు. కరోనా మరణాలలో 17,500 మంది న్యూయార్క్ వాసులు ప్రాణాలతో బయటపడేవారని చెప్పారు.

వైరస్ న్యూయార్క్‌లోకి ప్రవేశించినప్పుడు.. ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు 24,866 మంది చనిపోయారు. 394,079 కేసులు నమోదయ్యాయి. సునామి ఉధృతిని చూసే సమయానికి, ఆలస్యం అవుతుందనేది గ్రహించలేకపోయారు. కాలిఫోర్నియాలో కేసు సంఖ్యలు పెరగినప్పటికీ అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేసింది. అంతే కరోనా మరింతగా విజృంభించింది. అరిజోనా, కాలిఫోర్నియాలోని కొన్ని భాగాలు మళ్లీ మూతపడ్డాయి. అప్పటికే వేలాది మంది ప్రజలు కరోనా బారిపడ్డారు. 120,000 మందికి పైగా మరణించారు అప్పటినుంచే ప్రతిఒక్కరూ మాస్క్ లు ధరించడం ప్రారంభించారు.
This isn’t a COVID-19 wave, it’s a tsunami

కరోనా సునామీ కొత్త తీరప్రాంతాల్లోకి దూసుకుపోతుంది. ఈ మహమ్మారికి నిరోధించే టీకాలు సిద్ధంగా లేవు, చికిత్సలు అందుబాటులో లేవు. న్యూజిలాండ్ లేదా సింగపూర్ లేదా కొరియాలా వేగవంతగా అప్రమత్తం కాలేదు. ఈ దేశాలు కొత్త కేసులను వేగంగా గుర్తించాయి. అన్ని కాంటాక్టులను ట్రేస్ చేశాయి. అన్ని కంట్రోల్ కి తెచ్చాయి. అందుకే కరోనా తీవ్రత అక్కడ తగ్గిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ సమావేశాలకు దూరంగా ఉండటం, చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, టెస్టులు వంటి చేయడం చేస్తుండాలి.

READ  ఒబామాను కాపాడిన కుక్కకు ఘన సన్మానం

పాఠశాలలు, వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు వహించేలా చూడాలి. ఆరోగ్య మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టాలి. ఆర్థిక సహాయక వ్యవస్థలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ఈ వైరస్ ఉధృతి ఎప్పుడు అదృశ్యమవుతుందో చెప్పలేని పరిస్థితి.. సునామీ కొన్ని రోజులకు తీవ్రత తగ్గిపోవచ్చు.. కానీ, కరోనా మహమ్మారి అలా కాదని అంటున్నారు. అందుకే ప్రతిఒక్కరూ సురక్షితమైన జీవనానికి అలవాటు పడాలని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనల్ని మనం రక్షించుకోవాల్సిన ఉందని చెబుతున్నారు.

Related Posts