కేటీఆర్ మనసు దోచిన చిన్నోడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్‌కు పిల్లలు అంటే ఎంత ఇష్టమో పలు సంధర్భాల్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇవాళ(14 నవంబర్ 2020) బాల‌ల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పలు ఫోటోలను షేర్ చేసిన కేటీఆర్.. ప్ర‌పంచంలో త‌న‌కిష్ట‌మైన వ్య‌క్తులు పిల్ల‌ల‌ని అన్నారు. న‌వ్వుతున్న క‌ళ్ల‌తో న‌వ్వుతున్న ముఖాలు అంటూ ప‌లు ఫోటోల‌ను పంచుకున్న ఆయన.. సనత్‌ నగర్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తన్న సమయంలో ఓ చిన్నారి స్మార్ట్‌ ఫోన్‌ పట్టుకొని కేటీఆర్‌ను ఫోటో తీస్తున్న ఫోటోను షేర్ చేశారు.ఈ ఫోటోను అంతకుముందు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తన ట్విటర్‌ పోస్టు చేయగా.. అదే ఫోటోను కేటీఆర్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘ఈ చిన్నారి నా హృదయాన్ని దోచుకున్నాడు. నిన్న సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించాను. పలు వేదికలపై మాట్లాడాను. ఆ బాలుడు ఈ ఫొటోను ఎక్కడ తీశాడో కచ్చితంగా తెలియదు. కానీ, ఈ చిన్నారి బాగా ఫోకస్ పెట్టి ఫోటో తీశాడు’ అంటూ కేటీఆర్ స్మైలీ ఎమోజీని పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ అభిమానులను ఆకట్టుకుంటుంది.


హైదరాబాద్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శుక్రవారం ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌.. బల్కంపేట్‌లో వైకుంఠదామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సనత్‌నగర్‌లోని థీమ్‌ పార్క్‌ నిర్మాణానికి మంత్రి తలసానితో కలిసి భూమి పూజ చేశారు. మోండా మార్కెట్ వద్ద నూతన గ్రంథాలయ భవనాన్ని, మారేడ్‌పల్లిలో జీహెచ్‌ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్‌ హాల్‌‌ను ప్రారంభించారు. ఈ సంధర్భంగా వేదికల వద్దే ఈ ఫోటో తీశారు.

Related Tags :

Related Posts :