సోషల్ డిస్టెన్స్ ను సీరియస్ గా తీసుకున్న కుక్కపిల్ల

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

క‌రోనా నేప‌థ్యంలో సామాజిక దూరం లేదా భౌతిక దూరం పాటించ‌మ‌ని మ‌నుషుల‌కు చెప్పి చెప్పి నోరు పోవాల్సిందే కాని ఒక‌రు కూడా పాటించ‌డం లేదు. అయితే ఓ కుక్క‌పిల్ల మాత్రం రోడ్డు మీద గుంపులు గుంపులుగా వెళ్తున్న వారితో న‌డిస్తే త‌న‌కి ఎక్క‌డ క‌రోనా వ‌స్తుందో అని చాలా జాగ్ర‌త్త‌గా దూరంగా న‌డిచింది.

కుక్క దూరం వెళ్లినా మ‌నుషులు ద‌గ్గ‌ర‌కు వ‌స్తార‌ని నోటితో క‌ర్ర‌ను అడ్డంగా ప‌ట్టుకొని న‌డిచింది. మ‌నుషులు ఎవ‌రైనా ఎదు‌రొస్తే ఈ క‌ర్ర వారిని దూరం జ‌రిగేలా చేస్తుంది. ఈ కుక్క‌పిల్ల వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ప‌ప్పీ సామాజిక దూరాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకుంది అనే క్యాప్షన్ తో 34 సెకండ్ల‌పాటు కుక్కపిల్ల న‌డిచే ఈ వీడియోను ‘వెల్‌క‌మ్ టు నేచ‌ర్’ ట్విట‌ర్‌లో షేర్ చేసింది. ‘ప‌ప్పీ చాలా తెలివైన‌ది’, మనుషులకన్నా నువ్వే నయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత చ‌క్క‌టి ఉపాయం ఫాలో అవుతున్న కుక్క‌పిల్ల సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Posts