లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

కొత్త రెస్టారెంట్ ఓనర్ నిజాయితీ : తన హోటల్లో ఫుడ్‌కు తానే చెత్త రివ్యూ ఇచ్చుకున్నాడు!

Published

on

This restaurant owner gives incredibly honest reviews : కొత్త రెస్టారెంటుకు వెళ్లేటప్పుడు అక్కడి ఫుడ్, సర్వీసు గురించి రివ్యూలు చూస్తుంటారు. ఆ రెస్టారెంటులో ఫుడ్ తిన్నవారి రివ్యూల ఆధారంగా అక్కడికి వెళ్లాలా? వద్దా అని నిర్ణయించుకుంటారు. ఎక్కడైనా ఏ రెస్టారెంటులో అయినా ఫుడ్‌పై కస్టమర్లు రివ్యూలు ఇవ్వడం చూశాం. ఫుడ్, సర్వీసు నచ్చితే.. గుడ్ అని… లేదంటే బ్యాడ్ అంటూ రివ్యూలు ఇస్తుంటారు. కానీ, ఓ చైనీస్ రెస్టారెంట్ ఓనర్ మాత్రం తన హోటల్ ఫుడ్‌కు తానే చెత్త రెవ్యూ ఇచ్చుకుంటున్నాడు. కస్టమర్లకు ఆ ఛాన్స్ ఇచ్చేలా లేడు. తన సొంత రెస్టారెంటులో ఫుడ్ పై తానే విమర్శలు చేసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఎక్కడైనా రెస్టారెంట్ వాళ్లే మా ఫుడ్ చెత్తగా ఉంటుందని చెప్పుకుంటారా? అంటే.. ఇదిగో నేనున్నా అంటూ నిజయితీగా ఒప్పేసుకుంటున్నాడు. అంతేకాదు..తన హోటళ్లో ఏయే ఫుడ్, ఏ రెసిపీ ఎంత చెత్తగా ఉంటుందో కూడా ముందే చెప్పేస్తున్నాడు. ఇలా చెప్తే.. ఎలా? హోటల్ కు ఎవరోస్తారు? ఇదేమైనా ఆఫర్ ఇస్తున్నాడా? వచ్చే కస్టమర్లు కూడా పోతారనే భయం కూడా లేదు పాపం ఇతడికి అంటున్నారు.. ఆంట్ దాయ్ లోని Feigang Fei అనే హోటల్ యజమాని… తన రెస్టారెంటులో ఆరెంజ్ బీఫ్.. అంతా రుచిగా ఉండదని అంటున్నాడు. ఎవరైనా ఆర్డర్ ఇస్తే ముందే బాగుండదని చెప్పేస్తున్నాడంట.


సింగపూర్ నుడిల్స్ లో కర్రీ ఫ్లేవర్ ఎంచుకోవచ్చుని అంటూనే అంతగా టేస్టీగా ఉండదని సలహా ఇస్తున్నాడు. తమ హోటల్ ఫుడ్ మెనూలో కొత్త వంటకాలను యాడ్ చేశామని చెబుతున్నాడు. అవి అంతగా పాపులర్ కాదంట.. తాను కూడా వాటిని అసలే టేస్ట్ చేయలేదంటున్నాడు. స్టాటే సాస్ బీఫ్ అనే వంటకాన్ని కూడా కొత్తగా మెనూలో చేర్చామన్నాడు. కానీ, ఇంతవరకు దాని టెస్టు ఎలా ఉందో ట్రై చేయలేదంట.. చాలా మంది కస్టమర్లకు ఈ రెసిపీ అంటే పిచ్చి.. ఇప్పటికీ టేస్ట్ చేసేందుకు ఛాన్స్ రాలేదంట..

తన రెస్టారెంటులో తాను తినేందుకు మరింత సమయం గడపాల్సి ఉందని అంటున్నాడు. తన హోటల్ ఫుడ్ బాగోదని ఒప్పుకున్న యజమాని ఫెయి నిజాయితీని కస్టమర్లు మెచ్చుకుంటున్నారు. అతడి రెస్టారెంట్ ఫుడ్ మెనూను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదొక కొత్త రకం బిజినెస్ అంటున్నారు. ఇలాగైనా తన హోటల్ పాపులర్ అవుతుందేమో ఇలా చేస్తున్నాడమోనని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.