కరోనా కళ్యాణం : బంధు మిత్రుల కటౌట్లు పెట్టుకుని పెళ్లి చేసుకున్న జంట..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారతీయ సంప్రదాయంలో పెళ్లి అంటూ బంధువుల..మిత్రుల సందడిలేనిదే జరగదు. ఛలోక్తులు..సరదాలు..సరసాలు..విరసాలు..ఛణుకులు కులుకుల మధ్య ఓ అమ్మాయి అబ్మాయి ఓ ఇంటివారవుతారు. తాతలు..నాయనమ్మలు..అమ్మమ్మలు..మావయ్యలు..బాబాయిలు..పిన్ని ఇలా బంధు మిత్రుల కోలాహలాల మధ్య ముత్తైదువుల ఆశీర్వాదాలతో సందడి సందడిగా పెళ్లిళ్లు జరుగుతుండేవి.


కానీ ఇది కరోనా కాలం. ఈ కాలపు పెళ్లిళ్ల స్టైల్ మారిపోయింది. అతి తక్కువమంది మధ్య పెళ్లిళ్లు చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో సందడి లేదు..సరదాలు లేవు.అతిథులు లేని పెళ్లిళ్లు వెలవెలబోతున్నాయి. కొంతమంది అయితే కొత్తగా వర్చువల్ వీడియోల్లో నవ దంపతులకు అక్షింతలు జల్లుతున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ పెళ్లి ఇంకొక ఎత్తు అనేలా జరిగింది ఓ పెళ్లి. వెరీ డిఫరెంట్. ‘బంధు మిత్రుల ఫోటోలనే కటౌట్లు’గా పెట్టుకుని పెళ్లి చేసుకున్నారో జంట.


మందిరా బేడి కాదు.. ‘మందు’రా బేడి అట!..


యూకేకు చెందిన రోమనీ, సామ్ రోన్డ్యూ స్మిత్‌కు జూలైలో ఎంగేజ్ మెంట్ అయ్యింది. కరోనా తగ్గాక పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ఈ మహమ్మారి ఇప్పట్లో పోదని నిపుణులు చెబుతుండటంతో ఆగస్టు 14కు పెట్టుకున్నారు. తమ పెళ్లిని కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో చేసుకోవాలని అనుకున్నారు. జీవితంలో చాలా ముఖ్యమైన బంధాన్ని బంధు మిత్రుల ఆశీర్వాదంతో చేసుకోవాలని ఆశపడ్డారు. కానీ కరోనా టైమ్ అది జరిగేలా లేదు.ఎవరూ లేని పెళ్లి ఓ పెళ్లి అనిపించుకుంటుందా? అలాంటి పెళ్లిని ఓ తియ్యని జ్ఞాపకంగా జీవితాంతం ఎలా గుర్తు పెట్టుకుంటాం? అనుకున్నాడు. ఇలా ఆ జంట బాగా ఆలోచించి ఓ వినూత్న ఆలోచన చేసింది.


వారి వారి బంధు మిత్రుల కటౌట్లను కార్డ్‌బోర్డులతో తయారు చేయించింది. వాటిని పెళ్లి వేదిక వద్ద ఏర్పాటు చేశారు. వాటి సమక్షంలో పెళ్లి చేసుకుని, అందరితో కలిసి ఫోటో దిగినట్లు పోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా, ‘హవాయిన్ షర్ట్ ఫోటోగ్రఫీ’ తమ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. బాగానే ఉంది ఐడియా అంటూ మెచ్చుకుంటున్నారు. మరి ఏం చేస్తాం..జీవితాంతం తియ్యని అనుభూతిగా మిగలాల్సిన పెళ్లి బంధుమిత్రుల కటౌట్ల మధ్య చేసుకోవాల్సి వస్తోంది. దటీజ్ కరోనా టైమ్..కొత్త కొత్త ఆలోచనలు కలిగించ కరోనా కాలం… అని అనుకోకతప్పదు.

Related Posts