లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

స్టార్ లింక్ ఇంటర్నెట్ స్పీడ్ 300Mbps రెట్టింపు అవుతుందన్న ఎలన్ మాస్క్

Updated On - 10:08 am, Tue, 23 February 21

Starlink internet speeds will double : స్పేస్ ఎక్స్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ ప్రొవైడర్ స్టార్ లింక్ ఇంటర్నెట్ స్పీడ్ ఈ ఏడాది తర్వాత రెట్టింపు అవుతుందంట.. ఎలన్ మాస్క్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్టార్ లింక్ బీటా కిట్ అందుకున్న వారికి సమాధానంగా ఎలన్ ట్వీట్ చేశారు. ప్రస్తుం స్టార్ లింక్ కంపెనీ తమ వినియోగదారులకు 50Mbps నుంచి 150Mbps వరకు స్పీడ్ అందిస్తామని హామీ ఇచ్చింది.


అయితే ఈ ఏడాది తర్వాత మాత్రం స్టార్ లింక్ ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం 150Mbps నుంచి 300Mbps స్పీడ్ వరకు రెట్టింపు అవుతుందని ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. తక్కువ నుంచి మధ్య జన సాంధ్రత కలిగిన ప్రాంతాల్లో ప్రత్యేకించి ఈ ఇంటర్నెట్ స్పీడ్ యాక్సస్ చేసుకోవచ్చునని అన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో అందిస్తున్న ఇంటర్నెట్ కంటే అత్యంత స్పీడ్ ఉంటుందని రెండో ట్వీట్ లో తెలిపారు. అలాగే తమ నెట్ వర్క్ లాటెన్సీ కూడా 20ms వరకు మెరుగుపర్చనున్నట్టు పేర్కొన్నారు.


స్టార్ లింక్ ఇంటర్నెట్ స్పీడ్ కు సంబంధించి స్ర్కీన్ షాట్లను కూడా మాస్క్ షేర్ చేశారు. ప్రస్తుతం తమ లాటెన్సీ 34 నుంచి 44ms వరకు అందిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు స్టార్ లింక్ వెబ్ సైట్లో మాత్రం బీటాలో 20ms నుంచి 40ms వరకు ఉంటుందని వెల్లడించింది. ఏ ఇంటర్నెట్ వినియోగదారుడు ముందుగా 100 డాలర్ల స్టార్ లింక్ నెట్ వర్క్ ను ప్రీ ఆర్డర్ చేస్తారో వారికి ఈ స్పీడ్ లాటెన్సీని అందించనున్నట్టు తెలిపారు.