లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

సోడాల్రాజు జీవిత కథ : ‘తోలుబొమ్మలాట’ ట్రైలర్

కుటుంబ విలువలు హైలెట్‌గా రూపొందుతున్న ‘తోలుబొమ్మలాట’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

Published

on

Tholu Bommalata Theatrical Trailer

కుటుంబ విలువలు హైలెట్‌గా రూపొందుతున్న ‘తోలుబొమ్మలాట’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

‘ఆనలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’, ‘ఓనమాలు’, ‘ఓ బేబి!’, సినిమాలు నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం.. తన నటనతో ఆ సినిమాలకు వన్నె తెచ్చారాయన.. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా.. ‘తోలుబొమ్మలాట’..

ఐశ్వర్య మాగంటి సమర్పణలో, సుమ దుర్గా క్రియేషన్స్ బ్యానర్‌పై.. మాగంటి దుర్గా ప్రసాద్ నిర్మిస్తుండగా.. విశ్వనాధ్ మాగంటి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత, విశ్వంత్, వెన్నెల కిషోర్, ధనరాజ్, నర్రా శ్రీను, దేవీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కనుమరుగైపోతున్న మానవ సంబంధాల యెుక్క గొప్పతనాన్ని తెలిపేలా తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

గ్రామీణ వాతావరణం, కుటుంబ విలువలు, సంప్రదాయాలు వంటివి ట్రైలర్‌లో చూపించారు. కుటుంబం కోసం సోమరాజు పడే ఆవేదనే ఈ సినిమా కథ అని ట్రైలర్‌ని బట్టి అర్థం అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ సోమరాజు అలియాస్ సోడాల్రాజు పాత్రలో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘తోలుబొమ్మలాట’ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం : సురేష్ బొబ్బిలి. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *