Home » లవ్ జిహాద్ పై మధ్యప్రదేశ్ సీఎం సంచలన వ్యాఖ్యలు
Published
2 months agoon
By
murthyThose plotting religious conversion, trying ‘love jihad’ will be destroyed : లవ్ జిహాద్ పేరిట మత మార్పిడి వంటి కుట్రలకు పాల్పడే వారిని నాశనం చేస్తాం అంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా హెచ్చరించారు. మత మార్పిడి లక్ష్యంతో వివాహం చేసుకునే వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించేలా రాష్ట్రం ముసాయిదా బిల్లును రూపొందించిన కొన్ని రోజులకే సీఎం ఈ హెచ్చరిక చేయటం గమనార్హం. ఇక పెళ్లి పేరుతో ముస్లిం యువకులు హిందూ యువతుల మతం మార్చే ఈ ప్రక్రియ పట్ల దేశవ్యాప్తంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Govt belongs to everyone – all religions & castes. There is no discrimination but if someone tries to do anything disgusting with our daughters, then I’ll break you. If someone plots religious conversion or does anything like ‘Love Jihad’, you will be destroyed: MP CM SS Chouhan pic.twitter.com/Tj1nwnu14q
— ANI (@ANI) December 3, 2020
ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే లవ్ జిహాద్ పదం ఎక్కువగా వినిపిస్తోంది. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ చట్టం తీసుకురాగా ఇప్పుడు మధ్య ప్రదేశ్ కూడా ఆజాబితాలో చేరబోతోంది. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టం చేయడం అంటే వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అని కొందరు వాదిస్తుండగా.. ఈ తరహా పెళ్లిల్లు ప్రేమ వివాహాలు కదా.. మరి మతం మార్చుకోవడం ఎందుకు. ప్రేమకు అడ్డురాని మతం పెళ్లికి ఎలా అడ్డంకిగా మారుతుంది.. వివాహం పేరుతో అమ్మాయే మతం మారాలా.. అబ్బాయి కన్వర్ట్ అయితే ఏం అవుతుంది అంటూ ప్రశ్నలు లేవనేత్తేవారు మరికొందరు. ఈ చర్చ ఎలా ఉన్నప్పటికి వివాహం పేరుతో మతం మారడానికి వీలు లేదని పలు రాష్ట్రాలు వాదిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా వివాహం పేరిట బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడేవారికి పదేళ్ల జైలు శిక్ష విధించేంలా ముసాయిదా బిల్లును రూపొందించింది. అయితే ఈ బిల్లుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అసమ్మతి, అసహనం, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కానీ సీంఎ శివరాజ్ సింగ్ వీటిని ఏ మాత్రం లెక్కచేయడం లేదు. పైగా లవ్ జిహాద్ పేరిటి మత మార్పిడి వంటి కుట్రలకు పాల్పడితే.. నాశనం చేస్తాం అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
సెహోర్ జిల్లాలోని నస్రుల్లాగంజ్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ప్రతి ఒక్కరిది.. అన్ని మతాలు, కులాలకు చెందినది. ఓ మతం, కులం, ప్రాంతం పట్ల ప్రభుత్వం పక్షపాతం చూపదు. కానీ మా కూతుళ్లుతో ఎవరైనా అసహ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే.. ఊరుకోం. లవ్ జిహాద్ పేరిట ఎవరైనా మత మార్పిడి వంటి కుట్రలకు ప్లాన్ చేస్తే వారిని నాశనం చేస్తాం’ అంటూ చౌహాన్ తీవ్రంగా హెచ్చరించారు.
ధర్మ స్వతంత్ర బిల్లు(మత స్వేఛ్చ) 2020 ముసాయిదా బిల్లను డిసెంబర్ 28 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ చట్టం ప్రకారం వివాహం కోసం స్వచ్ఛందగా మతం మారాలని భావిస్తున్న వారు నెల రోజులు ముందుగా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ తరహా కేసుల్లో అభ్యంతరాలు ఉంటే సంరక్షకులు ఫిర్యాదు చేయవచ్చు.. ఇలాంటి వివాహాలను సులభతరం చేసే పూజారులను, మత పెద్దలను నిందితుడిగా పరిగణించడమే కాక జరిమానా విధిస్తారు. ఈ తరహా కార్యక్రమాలను ప్రొత్సాహించే సంస్థల గుర్తింపును రద్దు చేస్తారు అని పేర్కొంది.
ఇక ఇప్పటికే యూపీ లవ్ జిహాద్ పేరిట జరిగే బలవంతపు మత మార్పిళ్లను నియంత్రించడం కోసం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మరో వైపు బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హర్యానా కూడా లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టాలను ప్రవేశ పెట్టాలని చూస్తున్నాయి. “లవ్ జిహాద్” పేరిట మత మార్పిడులను అంతం చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప ఈ నెల మొదట్లో చెప్పారు. ఇంతలో, హర్యానా ప్రభుత్వం నవంబర్ 26 న ముగ్గురు సభ్యుల ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది.