three-capitals-ap-files-in-supreme-court

మూడు రాజధానుల అంశం..హైకోర్టులో తేల్చుకోవాలన్న సుప్రీం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మూడు రాజధానుల అంశం (పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు) స్థానిక హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుండడంతో జోక్యం చేసుకోలేమని చెప్పింది.



హైకోర్టులోనే తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఈ అంశంపై 2020, ఆగస్టు 27వ తేదీ గురువారం హైకోర్టులో విచారణ జరుగనున్న సంగతి తెలిసిందే. త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని ఈ సందర్భంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సీఆర్డీఏ, పాలనా వికేంద్రీకరణ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు విధించిన స్టేటస్ కోను సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.



రెండోసారి అధికార వికేంద్రీకరణ బిల్లు ప్రభుత్వం అంటే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. మండలి పక్కన పెట్టినా జూలై 17 నాటికి నెల పూర్తి అయితే ఆటోమేటిక్ గా అది ఆమోదం పొందినట్లేనన్నది నిపుణుల మాట.

రాజధాని నిర్ణయం ఎవరి పరిధిలోకి వస్తుందనే అనే అంశంపై ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రాల రాజధానుల నిర్ణయం ఆయా ప్రభుత్వాల పరిధిలో అంశమని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఏపీ హైకోర్టులో 2020, ఆగస్టు 06వ తేదీ గురువారం కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.



విశాఖలో ‘పాలన రాజధాని’ శంకుస్థాపనను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆగస్టు 16వ తేదీన శంకుస్థాపన చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

సెప్టెంబరు 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో కాలేజీలు ప్రారంభం


కానీ..రాజధానుల అంశాలకు సంబంధించి..కోర్టులో పెండింగ్ లో ఉండడంతో ఆ రోజు కాకుండా..దసరా రోజున నిర్వహించాలని తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ రోజు వరకు..అన్నీ అంశాలు పరిష్కారమౌతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Related Tags :

Related Posts :