లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

చిన్నారుల ప్రాణం తీసిన బిస్కెట్, మూడుకి పెరిగిన మృతుల సంఖ్య

Published

on

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. బిస్కెట్స్‌ తిన్న పిల్లల్లో మరో చిన్నారి మృతిచెందింది. ఇదివరకే హుస్సేన్ భాష, హుసేన్ బీ, మృతిచెందగా.. ఈ రోజు(సెప్టెంబర్ 16,2020) ఉదయం జమాల్‌బీ మరణించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో.. ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. ఇప్పటికే ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. రోజ్ మ్యాంగో బిస్కెట్ లకు సంబంధించిన డీలర్ సాయిరాం ఎంటర్ ప్రైజెస్ షాపును తనిఖీ చేశారు.

మండలంలోని చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఆదివారం(సెప్టెంబర్ 13,2020) రాత్రి టీ తాగి, బిస్కెట్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురై హుస్సేన్‌బాష (6) అనే చిన్నారి మృతి చెందగా..మరో ఇద్దరు ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే. వీరిలో హుస్సేన్‌బీ (4) అనే చిన్నారి కూడా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మ‌రో చిన్నారి జమాల్‌మీ మృత్యువుతో పోరాడి చనిపోయింది.

ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. బిస్కెట్లు వికటించడం ఏంటన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ఘటనపై పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టులో తయారైన బిస్కెట్ల ప్యాకెట్‌పై మరో 18 నెలల గడువు ఉంది. అందులో కల్తీ ఉంటే అస్వస్థతకు గురవడం తప్పా మరణాలు సంభవించే పరిస్థితి చాలా అరుదని అధికారులే అంటున్నారు. దీంతో బిస్కెట్లలోనే ఎవరైనా విషం కలిపారా? లేక పాలు / టీలో విష ప్రయోగం జరిగి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

హోల్‌సేల్‌ దుకాణం సీజ్‌:
చింతకొమ్ముదిన్నెలోని చిల్లర దుకాణానికి బిస్కెట్లు సరఫరా చేసిన ఆళ్లగడ్డ పట్టణంలోని సాయిరాం ఎంటర్‌ప్రైజెస్‌ హోల్‌సేల్‌ దుకాణాన్ని పోలీసుల సూచన మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం (సెప్టెంబర్ 14,2020) సీజ్‌ చేశారు. ఆహార భద్రత అధికారులు వచ్చి పరిశీలించే వరకు దుకాణాన్ని మూసేయడంతో పాటు అందులో ఉండే బిస్కెట్లు బయటకు వెళ్లకుండా సీజ్‌ చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

చిన్నారుల మృతి ఘటనపై తహసీల్దార్‌ రవి, ఐసీడీఎస్‌ అధికారిణి సుశీల సోమవారం తమ సిబ్బందితో గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిన్నారులు బిస్కెట్లు కొనుగోలు చేసిన దుకాణం నిర్వాహకునితో పాటు గ్రామంలో పలువురితో మాట్లాడి వివరాలు సేకరించారు. చిన్నారుల మృతి ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ విషయంపై ఆహార భద్రత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి..దుకాణాన్ని సీజ్‌ చేయించాం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశాం. పోస్టుమార్టం నివేదికలు వస్తే ఎలా మృతి చెందారన్న విషయం బయటకు వస్తుంది’ అని ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *