లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

కూల్‌డ్రింక్‌ తాగిన పిల్లలకు అస్వస్థత..పురుగులమందు కలిసిందన్న వైద్యులు

Published

on

Three children who drank cool drink fell ill : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో కూల్‌డ్రింక్‌ తాగిన ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. గుడేపల్లి గ్రామంలో కూల్‌డ్రింక్‌ తాగిన ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని పరకాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిసిందని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు.

గుడేపల్లి గ్రామంలో బాధిత చిన్నారుల నానమ్మ ఊరికి వెళ్తూ తన మనుమడు రామ్ చరణ్ కు కూల్ డ్రింక్ కొనిచ్చారు. చిన్నారి సోదరుడితోపాటు అతడి స్నేహితుడికి కూల్ డ్రింక్ ఇప్పించడంతో ముగ్గురు కలిసి కూల్ డ్రింక్ తాగారు. శీతల పానియం తాగిన కొద్ది సేపటికే ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు.

సమీప బంధువులు గుర్తించి చికిత్స కోసం పరకాల ఆస్పత్రికి తరలించారు. చిన్నారుల పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. కూల్ డ్రింక్ తాగినంతమాత్రాన అస్వస్థతకు గురవ్వడం వైద్యులకు అంతుపట్టడం లేదు.