రోజుకు రెండుసార్లు కాఫీ చాలు.. మూడోది తాగితే తలనొప్పిని కోరి తెచ్చుకున్నట్టే!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Three coffees a day Migraines : తలనొప్పి రావడం అనేది కామన్.. కానీ, కొంతంమంది కొంచెం తలనొప్పిగా ఉంటే చాలు.. కాఫీ, టీలు తెగ తాగేస్తుంటారు.. కాఫీ, టీలు తాగితే తలనొప్పి తగ్గుతుందని భావిస్తుంటారు. వాస్తవానికి రోజులో ఎక్కువ సార్లు కాఫీ తాగడం మంచిది కాదంట. ఎందుకో తెలుసా? ఒకటి రెండు సార్లు కాఫీ తాగితే పర్వాలేదు. కానీ, మరో మూడోసారి కాఫీ తాగితే మాత్రం తలనొప్పి పోవడమే కాదు. లేని తలనొప్పిని కోరి తెచ్చుకున్నట్టేనని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ మంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారు. మైగ్రేన్లు చాలా కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు మనిషిని భరించలేనంతగా బాధిస్తుంటాయి. తలనొప్పితో ఏ పని చేయాలేరు. కాఫీ తాగితే తలనొప్పి పూర్తి స్థాయిలో తగ్గిస్తుందనడానికి కచ్చితమైన ఆధారాలేమి లేవని అంటున్నారు నిపుణులు.

అమెరికాలో పెద్ద వయస్సు వారిలో 10 మందిలో 9 మంది రోజూ కాఫీ తాగుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా కాపీని నిత్యం వినియోగిస్తున్నారు. ప్రతి ఏడాదిలో 400 బిలియన్ కప్పుల కాఫీని తాగుతున్నారంట.. కాఫీ వినియోగంపై పరిశోధకులు విస్తృతంగా అధ్యయనం చేశారు. కాఫీ ఆరోగ్య ప్రయోజనాలపై అనిశ్చితి నెలకొంది.మైగ్రేన్ ప్రమాదంపై కాఫీ వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను పరిశోధకుల బృందం పరిశీలించింది. కెఫిన్ ఉండే కాఫీని తాగడం ద్వారా మైగ్రేన్ తలనొప్పికి ఎంతవరకు ప్రమాదం ఉందో అనేక అధ్యయనాలు జరిగాయి. 6 వారాలపాటు కెఫిన్, తలనొప్పి, ఇతర ఆసక్తి కారకాలపై రోజువారీ సమాచారాన్ని అధ్యయన బృందం సేకరించింది.

Three coffees a day

మైగ్రేన్లు ఎందుకు వస్తాయో పరిశోధకులకు ఖచ్చితంగా తెలియదు. కానీ, మెదడులోని రక్త నాళాలతో సంబంధం ఉందంటున్నారు. మైగ్రేన్ సమయంలో చాలా మంది అనుభవించే బాధాకరమైన నొప్పి రక్త నాళాల వాపుకు దారితీస్తుంది. వాపుకు కారణం.. మెదడు చుట్టూ రక్త ప్రవాహం పెరుగుతుంది. కాఫీ రక్తపోటును పెంచుతుంది.కాఫీ తాగిన తర్వాత చాలామంది ఎక్కువ మైగ్రేన్లనతో బాధపడినట్టుగా అధ్యయనాలు సూచించాయి. అయినప్పటికీ మైగ్రేన్లకు కాఫీ కారణమని కచ్చితంగా వెల్లడించలేదు. తాజా అధ్యయనంలో.. బెర్టిష్, సహచరులు ఎపిసోడిక్ మైగ్రేన్లతో బాధపడుతున్న 98 మంది పెద్దలను ఎలక్ట్రానిక్ డైరీలో రోజుకు రెండుసార్లు 6 వారాలపాటు నోట్ చేస్తూ వచ్చారు. మైగ్రేన్ ఫ్రీక్వెన్సీని కాఫీ వినియోగంతో పోల్చి చూశారు. వారు కాఫీ తాగడంతో పాటు ఇతర జీవనశైలి అంశాలను కూడా నోట్ చేశారు.అధ్యయనంలో పాల్గొనేవారు నెలకు సగటున 5 మంది తలనొప్పిని అనుభవించినట్లు డేటాలో తేలింది. అయినప్పటికీ, మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తాగేవారిలో గణనీయంగా మైగ్రేన్ బారినపడ్డారని గుర్తించారు. అధిక కెఫిన్ కాఫీ తాగిన రోజున మైగ్రేన్ తలనొప్పికి కారణమవుతుందని వెల్లడించింది.

READ  ఉద్యోగం మారినందుకు రూ.1300 కోట్లు ఫైన్

రోజుకు 0, 1, లేదా 2 సార్లు కాఫీ తాగినవారిలో రోజుకు ఒకసారి తలనొప్పి వస్తుందని అంటున్నారు. అయితే 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు కాఫీ తాగినవారికి రోజుకు సగటున రెండుసార్లు తలనొప్పి వస్తుందని పరిశోధకులు అధ్యయనంలో గుర్తించారు.

Related Posts