Three friends shared One cigarette tests corona positive

సింగిల్ సిగిరెట్ ముగ్గురికి కరోనా అంటించేసింది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పొగతాగొద్దు పోతారు..అంటూ ఎన్ని ప్రకటనలు వచ్చినా సిగిరెట్లు కాల్చటం మానట్లేదు. అదే సిగిరెట్ ముగ్గురుకి కరోనా అంటించింది.పెనుభూతంలా విస్తరిస్తూ రోజురోజుకీ పాకిపోతున్న కరోనా సింగిల్ సిగిరెట్ తో ముగ్గురికి వ్యాపించింది. 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ జియాగూడలో కరోనా వచ్చిన వారి అంత్యక్రియలకు వెళ్లొచ్చాడు. ఆ కార్యక్రమం అయిపోయాక షాద్ నగర్ కు తిరిగొచ్చి సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి సిగరెట్ తాగాడు. ముగ్గురు స్నేహితులు ఒకే సిగరెట్ ను షేర్ చేసుకోవడంతో… ముగ్గురికీ పాజిటివ్ వచ్చింది. 
దీంతో ముగ్గురినీ క్వారంటైన్ కు తరలించారు.

భౌతిక దూరం పాటించాలనీ..మాస్క్ లు తప్పనిసరిగా పెట్టుకోవాలని నెత్తీ నోరూ కట్టుకుని చెబుతున్నా..ఇటువంటి మూర్ఖుల వల్ల కరోనా పాకిపోతోంది. ఏమాత్రం బాధ్యత లేకుండా ఇటువంటి పనులు చేస్తున్న వారిని మూర్ఖులు అనకుండా ఎలా ఉంటాం.

కరోనా అంటే ఏదో వచ్చి పోతుందిలే అనుకుంటున్నారేమో..నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలే పోవచ్చు. ఈ విషయాన్ని ప్రతీ  ఒక్కరూ గుర్తించాలి.అది మనకూ మంచిది సమాజానికి మంచిది.

Read: హైదరాబాద్ లో కానిస్టేబుల్ కు కరోనా

Related Posts