ఒడిషాలో బస్సు బోల్తా….ముగ్గురి మృతి….15మందికి గాయాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Three killed, 15 injured in bus accident in Odisha : ఒడిషాలోని రాయగడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా…  మరో 15 మంది గాయపడ్డారు.  సోమవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కోరాపుట్ లోని లక్షీపూర్ నుంచి కటక్ వెళుతున్న బస్సు జిల్లాలోని బిస్సామ్ కట్టాక్ ప్రాంతంలోని హజారిడంగ్ గ్రామం వద్ద బోల్తా పడింది.

డ్రైవర్  మితిమీరిన  వేగంతో బస్సు నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు గాయపడిన ప్రయాణికులు చెపుతున్నారు.  కాగా……ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, అతని అసిస్టెంట్, మరో ప్రయాణికుడు మరణించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.


మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాయగడ జిల్లా కలెక్టర్ ప్రమోద్ బెహరా ఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధితిని సమీక్షించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్ధితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం  విశాఖపట్నం తరలించారు.Related Tags :

Related Posts :