Three Men Rape Minor Girl

దారుణం : మైనర్‌పై ముగ్గురు అత్యాచారం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పెద్దపల్లి జిల్లా బొంపల్లిలో దారుణం జరిగింది. మైనర్‌ బాలికపై ముగ్గురు అత్యాచారం చేశారు. 8 నెలల గర్భవతి అయిన బాలిక.. 4 రోజుల క్రితం చనిపోయిన ఆడశిశువుకు జన్మనిచ్చింది. బాధితురాలు పెద్దపల్లి డిసిపి సుదర్శన్‌ గౌడ్‌ను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రేమ పేరుతో మోసం:
బొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మేరపల్లి గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో రంజిత్ అనే యువకుడు మైనర్ బాలికను మోసం చేశాడు. ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ తన ఇద్దరు స్నేహితులతో కలిసి బాలకపై దురాఘతానికి పాల్పడ్డారు. 10 నెలల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం బాలిక డెలివరీ కావడంతో విషయం వెలుగుచూసింది. అత్యాచారం గురించి బయట చెబితే చంపేస్తామని ఆ ముగ్గురు యువకులు బెదిరించారు. దీంతో బాలిక, ఆమె తల్లిదండ్రులు మౌనంగా ఉండిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. మైనర్‌పై అత్యాచారం ఘటన స్థానికంగా సంచలనమైంది. ఆ ముగ్గురు కామాంధులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts