Home » పోలింగ్‌కు ఏర్పాట్లు : హుజూర్ నగర్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు
Published
1 year agoon
By
madhuతెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. సున్నిత ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈవీఎంలు, తదితర సామాగ్రీతో కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 24న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం 3 వేల 239 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 90 వేల 403 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 8.95 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 1500 మంది సిబ్బంది పాల్గొననున్నారు. 79 సమస్యాత్మక కేంద్రాలు ఈసీ గుర్తించింది. 7 మండలాల్లో 302 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లున్నారు.
హర్యానాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఎన్నికల బరిలో వేయి 168 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 19 వేల 425 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. కోటి 82 లక్షల 98 వేల 714 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.