Three students died for bathing in Stream

కార్తీక పౌర్ణమి స్నానానికి వెళ్లి ముగ్గురు పిల్లలు మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కార్తీక పౌర్ణమి వేడుకల్లో విషాదం నెలకొంది. వాగులో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరుకోలులో విషాదం నెలకొంది. వాగులో కార్తీక పౌర్ణమి స్నానానికి వెళ్లి.. ముగ్గురు విద్యార్ధులు మృత్యువాత పడ్డారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం (నవంబర్ 12, 2019) విద్యార్థులు మోయ తుమ్మెద వాగులో స్నానానికి వెళ్లారు.

స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు వాగులో పడిపోయారు. నీటిలో మునిగి శ్వాస ఆడకపోవడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులు నిఖిల్, కూన ప్రశాంత్, పేందోట వరప్రసాద్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. 

మృతి చెందిన విద్యార్థుల కుటుంబసభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి.

Related Posts