భర్త ముందే భార్యను లాక్కెళ్లి సామూహిక అత్యాచారం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. గిరిజన మహిళపై గుర్తు తెలియన వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. భర్త ముందే భార్యను లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వెలుగోడులో చోటు చేసుకుంది. వెలుగోడు మండలం జమ్మీనగర్ తాండకు చెందిన ఓ మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు.దీనికి సంబంధించి భార్యాభర్తలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సరైన సమాచారం తీసుకోకుండా కేసు నమోదు చేసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 307తోపాటు కొన్ని సెక్షన్ల పైనే కేసు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. అత్యాచారం కేసు నమోదు చేసుకోకుండా కేవలం కొన్ని కేసులు మాత్రమే నమోదు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తమకు న్యాయం చేయాల్సిన పోలీస్ అధికార యంత్రాంగం తమపైనే అసత్యంగా మాట్లాడుతూ తమపై దాడి చేసే ప్రయత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో దాదాపు మూడు గంటలపాటు భార్యపై అత్యాచారం చేశారని భర్త చెబుతున్నారు. భర్తను కట్టేసి ఇద్దరు వ్యక్తులు అతనిపై భారీ ఎత్తున దాడి చేసినట్లు తెలుస్తోంది.పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిండంతో గిరిజన సంఘాలు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. స్టేషన్ లోకి వెళ్లి ఆందోళన నిర్వహించారు. ఎస్ ఐ పూర్తి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒక గిరిజన మహిళపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేస్తే వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి, వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు నిర్లక్ష్యం చేశారని మండిపడుతున్నారు.

ఇద్దరు దుండుగులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే నలుగురిలో గిరిజనులే ముగ్గురు ఉన్నారని మహిళ భర్త చెబుతున్నారు. ఈ నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యాచారం చేసిన నిందితులకు అనుకూలంగా మాట్లాడుతున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

దీనికి సంబంధించి పోలీసు స్టేషన్ ముందు ఆందోళన చేసినప్పటికీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదని, నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ చెబుతున్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Related Posts