Home » పొలంలో పనిచేస్తున్న బాలికపై దాడి చేసి చంపిన పెద్దపులి
Published
2 months agoon
By
bheemrajtiger kill girl : తెలంగాణలో పెద్దపులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కుమ్రం భీం, మహబూబాబాద్ జిల్లాల్లో పులులు ప్రజలను కంటి మీద కునకులేకుండా చేస్తున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. కుమ్రం భీం జిల్లాలో మరోసారి పెద్దపులి పంజా విసిరింది. పెంచికల్ మండలం కొండపల్లి సమీపంలో బాలికపై పెద్దపులి డాడి చేసింది. పెద్దపులి దాడిలో 19 ఏళ్ల నిర్మల అనే బాలిక మృతి చెందారు.
పొలంలో పత్తి తీయడానికి వెళ్లిన బాలికపై పులి దాడి చేసి చంపేసింది. బాలిక మరణంతో స్థానికంగా విషాధం నెలకొంది. పనికని వెళ్లిన కూతురు విగతజీవిగా మారడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పెద్దపులి దాడి చేసిందా..మరొకటా అనే దానిపై ఫారెస్టు అధికారులు ఆరా తీస్తున్నారు.
నవంబర్ 11న జిల్లాలోని దహేగాం మండలం దిగుడలో విగ్నేష్ అనే యువకుడిపై పెద్దపులి దాడి చేసి చంపింది. మహబూబాబాద్ జిల్లా గూడురు-కొత్తగూడ ప్రాంతంలో పశువులుపై దాడి చేసింది. గుంజేడు ముసలమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో పులి పాదముద్రలను అధికారులు పరిశీలించారు.
నవంబర్ 27న జిల్లాలోని పెంచికలపేట మండలం అగర్గూడ గ్రామ సమీపంలోని పెద్దవాగు ప్రాంతంలో పెద్దపులి కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పెద్ద వాగు ప్రాంతంలో పెద్ద పులి నీరు తాగుతూ కనిపించడంతో కొందరు యువకుల వారు సెల్ఫోన్లతో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.