లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

వాట్ ఏ పవర్ : వాహనాన్ని వెనక్కి లాక్కెళ్లిన పులి..వీడియో వైరల్

Published

on

Tiger pulling tourist vehicle : పార్కుకు వెళ్లిన.. టూరిస్టులను పులి హఢలెత్తించింది. వాహనాన్ని లాక్కెళ్లాలని ప్రయత్నించడంతో అందులో కూర్చొన్న వారు తీవ్ర భయాందోనళలకు గురయ్యారు. నోటితో లాక్కెళుతున్న వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఒరి నాయనో ఇదేం పులిరా బాబు..అంటూ కేకలు వేశారు. ఈ ఘటన బెంగళూరులోని బన్సేర్ ఘట్టా నేషనల్ పార్కులో చోటు చేసుకుంది. కొంతమంది నేషనల్ పార్కుకు వచ్చారు. ఓ వాహనంలో కలియతిరుగుతున్నారు.

రెండు పులులున్న చోట వచ్చి వాహనాన్ని ఆపారు. అందులో ఒక పులి..వాహనం దగ్గరగా వచ్చింది. కారును లాక్కొని వెళ్లేందుకు ప్రయత్నించింది. కారు బంపర్ ను నోటితో పట్టుకుంది. లాగేందుకు ప్రయత్నించడంతో బంపర్ పాడైంది. నోటితో లాగితే రావడం లేదని గ్రహించిన ఆ పులి..పంజా దెబ్బ చూపించాలని అనుకుంది. కారును వెనక్కి లాగడంతో వాహనంలో కూర్చొన్న వారు భయాందోనళలకు గురయ్యారు. ఇదేం ఏం పులిరా బాబు..అంటూ కేకలు వేశారు. దీంతో పులి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. బతుకు జీవుడా అని వెళ్లిపోయారు. పక్క వాహనంలో ఉన్న వారు..సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.