లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

నిన్న ఇండియా, నేడు అమెరికా.. చైనాకు మరో గట్టి షాక్.. అమెరికాలో టిక్‌టాక్‌, వీచాట్‌పై బ్యాన్‌, యాప్స్‌ డౌన్‌లోడ్ నిలిపివేత

Published

on

vtiktok-and-wechat-us-to-ban-app-downloads-in-48-hours

చైనాను దెబ్బకొట్టే ఏ ఒక్క చాన్స్‌ను వదిలి పెట్టడం లేదు ట్రంప్‌. కరోనా వైరస్‌కు డ్రాగన్‌ కంట్రీయే కారణమని చెబుతున్న ట్రంప్‌.. చైనాను అంతకంతకూ దెబ్బతీస్తామన్నారు. తాజాగా చైనాకు గట్టి షాక్‌ ఇచ్చారు. ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను అమెరికాలో బ్యాన్‌ చేశారు. అమెరికా అన్నంత పని చేసింది. చైనాకు కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం(సెప్టెంబర్ 20,2020) నుంచి రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేయనున్నట్టు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటించింది.

అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరిస్తోందని వాణిజ్య విభాగం వెల్లడించింది. బైట్‌డ్యాన్స్‌ లిమిటెడ్‌కు చెందిన టిక్‌టాక్‌ కంపెనీ 100 మిలియన్ల మంది అమెరికా పౌరుల సమాచారాన్ని యాక్సస్‌ చేస్తుందని ఆరోపించింది. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని టిక్‌టాక్‌, వీ చాట్‌ యాప్‌లను బ్యాన్ చేసినట్టు తెలిపింది. మిగతా ఆంక్షలను త్వరలోనే వెల్లడిస్తామని వాణిజ్య విభాగం ప్రకటించింది.

చైనా టిక్‌టాక్‌ను బ్యాన్ చేస్తామని.. గత కొన్నిరోజులుగా ట్రంప్‌ చెబుతున్నారు. కరోనా వైరస్‌తో తమ దేశాన్ని అల్లకల్లోలం చేసిన చైనాకు బుద్ధి చెబుతామన్నారు. అటు చైనాపై ఎంత దూకుడుగా వ్యవహరిస్తే అధ్యక్ష ఎన్నికల్లో అంతమైలేజ్‌ వస్తుందని ట్రంప్‌ భావిస్తున్నారు. రెండు విధాలా లాభాలుండటంతో టిక్‌టాక్‌పై బ్యాన్ విధించారు అమెరికన్ ప్రెసిడెంట్.

ఇప్పటికే భారత్.. టిక్‌టాక్‌ సహా చైనా యాప్‌లను బ్యాన్ చేసింది. తాజాగా అమెరికా కూడా టిక్‌టాక్‌, వీచాట్‌కు చెక్‌పెట్టింది. వీచాట్ ఆదివారం నుంచి అమెరికాలో పూర్తిగా షట్ డౌన్ అవుతుంది. కాగా, నవంబర్ 12 వరకు టిక్‌టాక్‌ను ఉపయోగించగలుగుతారు. దీనిపై టెన్సెంట్, వీచాట్ యాజమాన్యాలు స్పందించాయి. బ్యాన్ విధించడం దురదృష్టకరం అన్నాయి. దీర్ఘకాలిక పరిష్కారం కోసం అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *