ట్రంప్​ అన్నంతపనీ చేశాడు… అమెరికాలో టిక్ టాక్ బ్యాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ట్రంప్​ అన్నంతపనీ చేశారు. అమెరికాలో టిక్ ​టాక్​, వుయ్ ​చాట్​పై వేటు వేస్తూ.. ఇవాళ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి ఇకపై అమెరికాలో ఈ యాప్​ లు డౌన్ ​లోడ్​ చేసుకొనేందుకు వీలవదని యూఎస్ డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్(DoC)తెలిపింది.అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకోబడిందని వాణిజ్య కార్యదర్శి విల్బర్ రాస్ తెలిపారు. అమెరికా జాతీయ భద్రతకు హామీ ఇవ్వడానికి మరియు చైనా కమ్యూనిస్ట్ పార్టీ బెదిరింపుల నుండి అమెరికన్లను రక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్ తన శక్తితో ప్రతిదీ చేస్తారని ఈ రోజు చర్యలు మరోసారి రుజువు చేస్తున్నాయి అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. “చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సిసిపి)…అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానం మరియు ఆర్థిక వ్యవస్థను బెదిరించడానికి ఈ యాప్ లను ఉపయోగించుకునే మార్గాలను మరియు ఉద్దేశాలను ప్రదర్శించిందని తెలిపారు.

చైనాకు చెందిన టెన్సెంట్ మరియు బైట్ డాన్స్ కంపెనీలకు చెందిన ఈ రెండు యాప్ లు iOS యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లే స్టోర్ నుండి నిషేధించబడటం మాత్రమే కాకుండా, ఆ రెండు కంపెనీలు యుఎస్ లో హోస్ట్ చేయకుండా నిరోధించబడ్డాయి.


తమ దేశ టిక్‌ టాక్‌ వినియోగదారుల సమాచారం చైనాకు చేరుతుందంటూ.. సమాచార భద్రతపై గతంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో యాప్.. యూఎస్‌ కార్యకలాపాలను సెప్టెంబరు 15లోగా విక్రయించేలా ట్రంప్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపినా.. బైట్‌ డ్యాన్స్‌ అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత ఒరాకిల్​- బైట్​డాన్స్​ల మధ్య ఒప్పందం కోసం చర్చలు జరిగినా.. పొత్తు కుదరలేనట్లు తెలుస్తోంది

Related Posts