TikTokను తరిమేశారు.. ‘Chingari’ను ఆదరిస్తున్న భారతీయులు.. ప్లే స్టోర్‌లో 2.5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టిక్ టాక్ ను తరిమేశారు మనోళ్లు… స్వదేశీ యాప్ చింగారిని ఆదరిస్తున్నారు. చైనా యాప్ టిక్ టాక్‌ను దేశం నుంచి తరిమికొట్టేశారు.. చైనా యాప్స్ మనకొద్దు.. మన యాప్స్ ముద్దు అంటూ స్వదేశీ మంత్రాన్ని జపిస్తున్నారు. టిక్ టాక్ పై పెంచుకున్న మమకారాన్ని దేశ కోసం వదిలిపెట్టేశారు. ఇప్పుడే అదే ప్రేమను స్వదేశీ చింగారి యాప్‌పై చూపిస్తూ ఆదరిస్తున్నారు. టిక్ టాక్ బ్యాన్ చేయడంతో చింగారి యాప్ డౌన్ లోడ్ చేసుకునే వారిసంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అంతేకాదు.. ఇప్పటివరకూ తమ ఫోన్లలో తిష్టవేసిన టిక్ టాక్ యాప్ ను డిలీట్ చేసేస్తున్నారు. చింగారి యాప్ ఇన్ స్టాల్ చేసేస్తున్నారు.

‘చింగారి’ భారతీయ వీడియో-షేరింగ్ యాప్. ఇప్పుడప్పుడే ప్రజాదరణ పొందుతోంది. గత ఏడాదిలో లాంచ్ అయినప్పటికీ ఈ చింగారి యాప్.. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో 2.5 మిలియన్ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కేవలం ఒక నెలలో లక్ష డౌన్‌లోడ్‌లకు పెరిగింది. బెంగళూరుకు చెందిన బిస్వాత్మా నాయక్, మిస్టర్ సిద్ధార్థ్ గౌతమ్ అనే ఇద్దరు ప్రోగ్రామర్లు ఈ స్వదేశీ Chinagari యాప్‌‌ను డెవలప్ చేశారు.

చైనాకు మర్చిపోలేని దెబ్బ కొట్టింది భారత్. లడఖ్ సరిహద్దుల్లో డ్రాగన్ అతి ఉత్సాహానికి తగిన బుద్ధి చెప్పింది ఇండియా. ప్రపంచంలో చైనాకు అతిపెద్ద ఆన్ లైన్ మార్కెట్ అయిన చైనీస్ యాప్స్‌కు భారత్ చెక్ పెట్టేసింది. భారత ఆన్ లైన్ మార్కెట్లో చైనీస్ యాప్స్ పై నిషేధం విధించింది. చైనా పాపులర్ వీడియో షేరింగ్ సోషల్ యాప్ టిక్ టాక్‌ను నిషేధించింది.

దేశంలో భద్రత, ప్రైవసీ దృష్ట్యా 58 ఇతర చైనీస్ యాప్‌లతో పాటు ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ యాప్‌ను బ్యాన్ చేశారు. TikTok తన భారతీయ పోటీదారులైన Roposo, Bolo Indyaతో పాటు ఇటీవలే లాంచ్ అయిన Chingari యాప్ రూపంలో ByteDance యాప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టిక్ టాక్ ప్రభావంతో పెద్దగా ఆదరణ పోందని పాత యాప్ చింగారికి ఇప్పుడు చాలా ప్రజాదరణ పొందింది. టిక్‌టాక్‌కు గట్టి పోటీ ఇస్తోంది కూడా. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చింగారి యాప్ డౌన్ లోడ్ చేసేసుకోండి.. స్వదేశీ యాప్స్ ను ఆదరించండి..

Read:చైనీస్ యాప్స్ భారత్ బ్లాక్ చేసిందని.. ఆందోళనలో డ్రాగన్!