ఇదిగో నా ఇల్లు.. బట్టలు.. నేను నిరుపేదనే!

TikTok sensation streams video of his house, clothes to prove he is not ‘faking’ poverty

తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెల్చుకున్న టిక్ టాక్ సెన్సేషన్ అర్మన్ రాథోడ్ తాను నిరుపేదనని నిరూపించుకున్నాడు. తన ఇంటితో పాటు తాను రోజు ధరించే బట్టలను చూపిస్తూ తన పేదరికాన్ని అందరికి తెలియజేశాడు. అచ్చం హృతిక్ రోషన్‌లానే స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్న రాథోడ్ పై నెటిజన్లు విమర్శలు చేశారు. పేదరికం పేరుతో మోసం చేస్తున్నాడంటూ అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. కొందరు టిక్ టాక్ యూజర్లు.. రాథోడ్ ప్రొఫెషనల్ డ్యాన్సర్ మాత్రమేనని.. నిరుపేదవాడికి నటిస్తున్నాడంటూ నెటిజన్లు విమర్శించారు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు తన ఇంటిని, బట్టలు, కుటుంబ సభ్యులను వీడియోలో రికార్డు చేసి అందరికి చూపించాడు. తాను చెప్పిన మాటల్లో అబద్ధం లేదని ఇదే తన జీవితమని వాపోయాడు. 

ఈ వీడియోలో రాథోడ్... రేకులతో కప్పిన తన చిన్న ఇంటిని చూపించాడు. తన తల్లిదండ్రులను కూడా చూపించాడు. తల్లి నేలపై కూర్చొని ఉంటే బియ్యం ఏరుతోంది.. తండ్రి నులక మంచంపై కూర్చొని ఉండటం కనిపిస్తోంది. తాను ధరించే బట్టలు ఎన్నో ఉన్నాయో చూపించాడు రాథోడ్. తన డ్యాన్స్ వీడియోల్లో తండ్రి బట్టలు ధరించి షూట్ చేసినట్టు తెలిపాడు. ఇతర సోషల్ మీడియా అకౌంట్లు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లలో కూడా అర్మన్ రాథోడ్ క్లారిటీ ఇచ్చాడు. మే 15న సోషల్ మీడియాలో రాథోడ్.. హృతిక్ రోషన్ సాంగ్ ‘యు ఆర్ మై సోనియా’ అనే సాంగ్ కు స్టెప్పులు వేస్తూ కనిపించాడు. 

ఈ వీడియోను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి ఇప్పటివరకూ 6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వైరల్ అయిన రాథోడ్ డ్యాన్సింగ్ వీడియోను చూసి నెటిజన్లంతా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో పోలుస్తూ ట్యాగ్ చేస్తున్నారు. ఈ ఒక్క పాటకు మాత్రమే రాథోడ్ డ్యాన్స్ వేయలేదు.. వాస్తవానికి రాథోడ్ షారుక్ ఖాన్, సల్మాణ్ ఖాన్ ఫ్యాన్ కూడా. తన అభిమాన హీరోల సినిమాల నుంచి పాటకలకు కూడా రాథోడ్ డ్యాన్స్ వేసేవాడు. టిక్ టాక్ అకౌంట్‌రెండు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. 

Read: ఫేస్‌బుక్ యూజర్ల సెక్యురిటీ కోసం కొత్త ఫీచర్‌

మరిన్ని తాజా వార్తలు