Home » CEO ఆఫర్: ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా.. ఆపిల్ స్టోర్లో ఇవ్వండి!
Published
1 year agoon
By
sreehariప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ సీఈఓ టిమ్ కుక్.. ఆండ్రాయిడ్ యూజర్లకు ఫన్నీ ఆఫర్ ప్రకటించారు. ఒకవేళ తమకు ఆండ్రాయిడ్ ఫోన్లు ఇస్తే తమ కంపెనీ ఏం చేస్తుందో ఓ ఇంటర్వ్యూలో కుక్ రివీల్ చేశారు. శాన్ ఫ్రాన్సిస్ కోలో డ్రీమ్ ఫోర్స్ 2019లో భాగంగా జరిగిన సేల్స్ ఈవెంట్ ముగిసిన అనంతరం ఆయన మార్క్ బెనియోఫ్ తో ప్రత్యేక ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిమ్ కుక్ హాస్యాస్పందంగా స్పందించారు.
‘ఒకవేళ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఉంటే.. మాకు ఇవ్వండి.. మా కంపెనీ ఆపిల్ స్టోర్లలో రీసైకిల్ చేస్తాం’ అంటూ జోక్ పేల్చారు. ఎంతమందికి సొంతంగా ఐఫోన్ ఉందంటూ ఆడియన్స్ అడిగిన ప్రశ్నకు టిమ్ కుక్ ఫన్నీగా సమాధానమిచ్చారు. ఆపిల్ డివైజ్ లు వాడే యూజర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
It’s incredible to see how Salesforce and their passionate developer community are using our products and software to change the way businesses work. From productivity to privacy, great technology can change everything. #DF19 pic.twitter.com/hCl7Ud9nEd
— Tim Cook (@tim_cook) November 19, 2019
ప్రపంచంలోనే ఉత్తమమైన ప్రొడక్టులను తయారు చేయడంలో క్యూపర్టినో ఆధారిత కంపెనీగా తమ లక్ష్యమని ఇంటర్వ్యూలో కుక్ స్పష్టం చేశారు. ‘గొప్ప సాంకేతిక అనేది ఉత్పాథకత నుంచి గోప్యత వరకు ప్రతిఒక్కదాన్ని మార్చేస్తుందని కుక్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.