Tirupati Srivari Darshanam Rules And Regulations

తిరుపతి శ్రీ వారి దర్శనం : నియమ నిబంధనలివే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిపివేయబడిన శ్రీ వారి దర్శనం మరలా కల్పించబోతోంది TTD. 2020, June 11వ తేదీ నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతినిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రతి రోజు ఆన్ లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న మూడు వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతినవ్వడం జరిగిందని, ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 వరకు మాత్రమే ఉంటుందన్నారు.

భక్తులు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి. మాస్కులను ఎల్లప్పుడూ ధరించాలి. కంటెయిన్మెంట్, రెడ్ జోన్లలో ఉండేవారు తిరుమలకు రాకూడదు. జూన్ 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులను, 10వ తేదీన స్థానికులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. 10 ఏళ్ల లోపు చిన్నారులకు, 65 ఏళ్లు పైబడినవారికి దర్శనానికి అనుమతి లేదు. అలిపిరి దగ్గర ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. వాహనాలను శానిటైజ్ చేస్తారు. VIP దర్శనం కేవలం గంట మాత్రమే అనుమతి ఉంటుంది.

శ్రీవారి మెట్టు మార్గం గుండా దర్శనానికి అనుమతినించారు. పుష్కరిణిలోకి భక్తులకు నో ఎంట్రీ. కల్యాణకట్టలో పనిచేసే వారు PPE కిట్లను ధరించాలి. భక్తులు ఉండే గదులు పూర్తిగా శానిటైజ్ చేస్తారు. దర్శనాల అనంతరం శఠగోపం, తీర్థ ప్రసాదాల వితరణ ఉండదు. కొండపై మిగిలిన ఆలయాల్లో దర్శనం ఉండదు. కల్యాణకట్ట, హుండీ, ప్రసాదాల అమ్మకం కౌంటర్ల వద్ద భక్తులు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి.

హుండీని ముట్టుకునే సమయంలో వారి చేతులను శానిటైజ్ చేస్తాం. ఘాట్ రోడ్డును ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకే మాత్రమే ఉంటుంది. ప్రతి రోజూ ర్యాండమ్‌గా భక్తుల నుంచి శాంపిల్స్‌ను సేకరిస్తారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. దేవాలయాల్లో అన్ని చోట్లా శానిటైజర్లను ఉపయోగించనున్నారు. మొత్తంగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Read: తిరుమలలో తలనీలాలు సమర్పించే కేంద్రాలు మూసివేత

Related Posts