కరోనా మృతులను కూడా వదల్లేదు.. మృతదేహాలపై ఉన్న బంగారం, నగదు మాయం.. దొంగలుగా మారిన ఆసుపత్రి సిబ్బంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

tirupati SVIMS covid hospital staff: వారిద్దరూ ఓ కోవిడ్‌ ఆస్పత్రి సిబ్బంది. వారి పని పేషెంట్స్‌కు ట్రీట్‌మెంట్‌ అందించడం. కానీ.. ఈ ఇద్దరి బుద్ధి వక్రమార్గం పట్టింది. సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు. అందుకు కోవిడ్‌ మృతులను టార్గెట్‌ చేసుకున్నారు. మృతులపై ఉండే బంగారం, మృతుల దగ్గర ఉండే నగదును కాజేయడం మొదలుపెట్టారు. కనీస మానవత్వం లేకుండా జేబులు నింపుకున్నారు. చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు.

మానవత్వం మంటకలిసింది:
మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు..మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు..అనే ప‌దాలు ఈ ఘ‌ట‌న‌కు స‌రిగా స‌రిపోతాయేమో. కరోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచారన్న జాలి, దయ లేకుండా..ఓ ఇద్దరు వ్యక్తులు..ఆ మృతుల బంగారు ఆభరణాలను కొట్టేశారు. కనీస మానవత్వం లేకుండా జేబులు నింపుకున్నారు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు. తిరుపతిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

కరోనాతో చనిపోయిన మృతుల బంగారు ఆభరణాలు, నగదు మాయం:
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో ఎంతో మంది కరోనా పేషెంట్లకు వైద్యం అందించారు. కొందరు కరోనాతో పోరాడుతూ ప్రాణాలు వదిలారు. అయితే ఆ మృతుల నుంచి గత కొద్ది రోజులుగా బంగారు ఆభరణాలు, వారి వద్ద డబ్బు మాయమవుతూ వచ్చింది. ఎవరు ఆ పని చేస్తున్నారా.. అని సీసీ ఫుటేజీ పరిశీలిస్తే…ఆస్పత్రి సిబ్బందే దొంగలని తేలింది.

వార్డు బాయ్, లేడీ నర్సే దొంగలు:
చిత్తూరు జిల్లా తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలోని కోవిడ్‌ మృతుల బంగారు ఆభరణాల మాయం కేసులో…దొంగలు దొరికారు. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వార్డు బాయ్‌, లేడీ నర్సు కలిసి మాయం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు…ఆ ఇద్దరి నుంచి నాలుగు బంగారు ఉంగరాలు, రూ.6వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇలా..మానవత్వం లేకుండా వ్యవహరిస్తే..కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

తిరుపతి స్విమ్స్ కోవిడ్ 19 హాస్పిటల్ లో మృతదేహాలపై బంగారు ఆభరణాలు మాయం వ్యవహారం దుమారం రేపింది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. వెంటనే స్పందించారు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. మాయమైన బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్స్ వెంటనే బాధిత కుటుంబ సభ్యులకు అందచేయడానికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరక్కుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కోవిడ్ హాస్పిటల్స్ లో గాని, ప్రైవేట్ హాస్పిటల్స్ లో గాని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు.

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లికి చెందిన వెంకటరత్నం నాయుడికి కరోనా సోకింది. సెప్టెంబర్ 14న ఆస్పత్రిలో చేరాడు. సెప్టెంబర్ 23న మృతి చెందాడు. కాగా, ఆయన శరీరంపైన ఉండాల్సిన రెండు బంగారు ఉంగరాలు మాయం అయ్యాయి. అంతేకాదు కరోనా పేషెంట్ చనిపోతే మ‌ృతదేహాలను వెంటనే కవర్లలో చుట్టేసి, కుటుంబసభ్యులకు కూడా చూపించకుండా దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.

READ  టెన్షన్ టెన్షన్ : 20వాహనాలతో కాకినాడకు పవన్.. భారీగా చేరుకుంటున్న జనసైనికులు

ఇదే అదనుగా బంగారు ఆభరణాలు, నగదు కాజేస్తున్నారు. చివరి చూపు కోసం మార్చురీకి వచ్చిన కుటుంబసభ్యులు బంగారు ఉంగరాలు కనిపించకపోవడంతో ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. గతంలో తాళిబొట్టు, గొలుసులు, ఉంగరాలు చోరీలకు గురయ్యాయి.

Related Posts