లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

మనిషా, సైకోనా.. వ్యూస్ కోసం పిల్లికి ఉరేసి టిక్ టాక్, యువకుడు అరెస్ట్

టిక్ టాక్ పిచ్చి బాగా ముదిరిపోతోంది. టిక్‌టాక్ మోజు యువతను వెర్రి వేషాలు వేయిస్తోంది. తలతిక్క పనులు

Published

on

TN police arrest 18-year-old for posting TikTok video after killing a cat

టిక్ టాక్ పిచ్చి బాగా ముదిరిపోతోంది. టిక్‌టాక్ మోజు యువతను వెర్రి వేషాలు వేయిస్తోంది. తలతిక్క పనులు

టిక్ టాక్ పిచ్చి బాగా ముదిరిపోతోంది. టిక్‌టాక్ మోజు యువతను వెర్రి వేషాలు వేయిస్తోంది. తలతిక్క పనులు చేయిస్తోంది. లైకులు, వ్యూస్, పాపులారిటీ పేరుతో కొందరు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే మరికొందరు కటకటాల్లోకి వెళ్తున్నారు. కొందరు సైకోల్లా మారిపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఓ యువకుడు వన్య ప్రాణులతో టిక్ టాక్ చేసి అరెస్ట్ అయిన ఘటన మరువక ముందే అంతకు మించిన దారుణం మరొకటి తమిళనాడులో జరిగింది. 

ఎక్కువ వ్యూస్ కోసం పెంచుకుంటున్న పిల్లికి ఉరి:
టిక్‌టాక్‌లో లైక్‌ లు, వ్యూస్ కోసం ఓ యువకుడు క్రూరంగా ప్రవర్తించాడు. ఏకంగా పిల్లికి ఉరేశాడు. పెంచుకుంటున్న పిల్లికి ఉరివేస్తూ టిక్‌టాక్‌ వీడియో తీశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేచేశారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా పళవూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని చెట్టికుళానికి చెందిన తంగరాజ్ (18) పశువుల ఫామ్‌లో పని చేస్తాడు. ఇతడు టిక్‌టాక్‌ యాప్‌ ఎక్కువగా వినియోగిస్తుంటాడు. కాగా పిచ్చి పీక్స్ చేరినట్టు ఉంది.  

పిల్లి ఉరేసి బ్యాక్ గ్రౌండ్ లో వడివేలు కామెడీ సీన్:
వస్తున్న లైక్ లు, వ్యూస్ సరిపోవడం లేదో మరో కారణమో కానీ, ఎక్కువ వ్యూస్ రావాలని పిచ్చి పని చేశాడు. మే 16న అతడు తన పెంపుడు పిల్లిని సీలింగ్ కు ఉరివేశాడు. ఆ దృశ్యాలను టిక్‌టాక్‌ వీడియో తీశాడు. దీనికి ప్రముఖ కమెడియన్ వడివేలు నటించిన ఫ్రెండ్స్ మూవీ సినిమాలోని కామెడీ సీన్ జోడించాడు. ఆ తర్వాత ఈ వీడియోను సోషల్ మీడియాలో ఉంచాడు. దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నెటిజన్లు మండిపడ్డారు. వాడు మనిషా సైకోనా అని తిట్టారు. వెంటనే ఆ వీడియో డిలీట్ చేసి అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఈ విషయం తిరునెల్వేలి జంతు హింస నివారణ అధికారులకు చేరింది. వాళ్లు దీనిపై పళవూర్‌ పోలీసులకు మే 19న ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం(మే 20, 2020) తంగరాజ్ ని అరెస్టు చేశారు. 

జింకతో మేక పాలు తాగిస్తూ, కుక్కలకు కుందేలు మాంసం వేస్తూ టిక్ టాక్:
అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కంబదూరు మండలం అయ్యంపల్లి గ్రామానికి చెందిన నాగార్జున గొర్రెల కాపరి. ప్రతి రోజూ అడవికి వెళ్తూ అక్కడ టిక్ టాక్ చేయడం సరదాగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు అడవిలో కనిపించిన జింక పిల్లను బంధించి దానితో బలవంతంగా మేక పాలు తాగించాడు. దీన్నీ వీడియో తీసి పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఒక రోజు కుందేలు మాంసాన్ని కుక్కలకు వేస్తున్న వీడియో తీశాడు. ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి చేరింది. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వన్యప్రాణులతో క్రూరంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారలు హెచ్చరించారు. 

1

టిక్ టాక్ పిచ్చిలో ఉన్మాదుల్లా మారిపోతారా?
వార్నింగ్ లు ఇస్తున్నా, అరెస్టులు చేస్తున్నా మార్పు రావడం లేదు. లైకుల కోసం మూగజీవాలను హింసించడం దారుణం అంటున్నారు. లైక్స్ కోసం పిల్లిని ఉరేసి టిక్ టాక్ చేయడం షాక్ కి గురి చేస్తోంది. ఉన్మాదానికి ఇది పరాకాష్ట అని నిపుణులు అంటున్నారు. చూస్తుంటే టిక్ టాక్ పిచ్చిలో పడి సైకోల్లా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదంటున్నారు.

Read: పాకిస్తాన్ లో హిందువుల ఇళ్లు కూల్చివేత

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *