జై శ్రీరాం అన్న పాక్ క్రికేటర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరగడం పట్ల..పాక్ క్రికేటర్ డానిష్ కనేరియా
సంతోషం వ్యక్తం చేశారు. జై శ్రీరామ్ అంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు మెచ్చుకోగా..ఇతరులు వేరే విధంగా స్పందిస్తున్నారు.హిందువులకు ఇదొక చారిత్రక ఘట్టంగా వెల్లడించారు. శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. అతని జీవితం నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని, భూమి పూజ జరగడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో సంబరపడుతున్నారని తెలిపారు.

పాక్ మాజీ క్రికేటర్ డానిష్ కనేరియా..మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా..జీవిత కాలం నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికేట్ లో పాక్ కు ప్రాతినిధ్యం వహించిన రెండో హిందూ క్రికేటర్ గా చెప్పవచ్చు. జీవిత కాల నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నాడు.

తాను హిందువు అయినందునే…పీసీబీలో తనకు మద్దతు లేదని వ్యాఖ్యానిస్తున్నారు. జీవితకాలం నిషేధం తన మీదే కానీ..వేరే వాళ్లకు కాదు..కులం, మతం, వర్ణం నేపథ్యం లాంటి విషయాలను బట్టి చట్టాలు అమలవుతాయా ? తానొక హిందువును..ఈ విషయంలో గర్వంగా ఉందంటున్నాడు.2000లో పాక్ తరపున అంతర్జాతీయ క్రికేట్ లో అడుగుపెట్టాడు. 61 టెస్టులు, 18 వన్డేలు ఆడి 276 వికెట్లు తీశాడు. పాకిస్థాన్ క్రికెట్‌‌లో కనేరియా ఓ బెస్ట్ స్పిన్నర్ అంటారు. జట్టు నుంచి తప్పించడంతో..చాలా రోజులు..స్థానం కోసం ఎదురు చూశాడు.

Related Posts