లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

ఆచూకీ లేని అసిస్టెంట్ డైరెక్టర్…..గాలిస్తున్న పోలీసులు

Published

on

tollywood assistant director missing : టాలీవుడ్ కు చెందిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కొద్దిరోజులనుంచి కనిపించకుండా పోయాడు. అదృశ్యమయ్యాడు. దీంతో అతని తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

యూసఫ్ గుడా మధురానగర్ లో నివసించే కార్తీక్(24) టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఈనెల 20న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని అమ్ముమ్మగారింటికి వెళ్లాడు. మర్నాడు హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. కానీ ఇంటికి వెళ్లకుండా మాదాపూర్ లోని స్నేహితుల వద్దకు వెళ్లాడు.ఆ తర్వాత స్నేహితులతో కలిసి పంజాగుట్ట వెళ్లాడు. ఆ తర్వాత నుంచి కార్తీక్ ఆచూకి తెలియలేదు. కార్తీక్ హైదరాబాద్ వచ్చేసాడని తెలుసుకుని తల్లితండ్రులు ఫోన్ చేస్తే… స్విచ్చాఫ్ రావటంతో అతడి కోసం గాలించారు. ఆందోళన చెందిన కార్తీక్ తండ్రి ఉత్తరాది లక్ష్మినారాయణ పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కాగా…ఇటీవల కార్తీక్ తన స్నేహితులు వంశీ, క్రాంతి, నివాస్ తదితరులతో కలిసి ఓ టీవీ చానల్ లో కార్యక్రమంకోసం రూ.10లక్షలతో పెట్టుబడులు పెట్టించాడని, ఆ తర్వాత స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగిపోవటంతో ఆందోళనకు గురై ఎటో వెళ్లిపోయాడని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోవివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *