సినీ పరిశ్రమను కాపాడుకుంటామన్న సీఎం కేసీఆర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

tollywood celebrities meets cm kcr : తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోవడం.. థియేటర్లు మూసివేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నిర్మాతల సంఘం ప్రతినిధులు.. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌‌ను కలిసారు.కోవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని… అలాంటి సమయంలో.. ఉన్న సినీ పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా.. అని టాలీవుడ్ ప్రతినిధులను ఆయన ప్రశ్నించారు. ఇటు ప్రభుత్వం, అటు సినిమా పరిశ్రమ పెద్దలు కలిసి పరిశ్రమను కాపాడుకోవడానికి సంయుక్త ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు.త్వరలోనే సినీ హీరో చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశమై..సినిమా పరిశ్రమ అభివృద్ధిపై విసృతంగా చర్చించాలనే నిర్ణయానికి వచ్చారు.సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో ప్రముఖ సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కేఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి.కళ్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Tags :

Related Posts :