జాతీయ జెండాకు సెల్యూట్ చేసిన టాలీవుడ్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సెల‌బ్రిటీలు త‌మ సామాజిక మాధ్యమాల ద్వారా 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఈ సందర్భంగా అమ‌ర‌వీరుల త్యాగాలు గుర్తు చేసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని వారు పేర్కొన్నారు.



మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, ర‌వితేజ, క‌ళ్యాణ్ రామ్, అల్లు అర్జున్, మోహ‌న్ బాబు, సుధీర్ బాబు, జ‌గ‌ప‌తి బాబు, కొరటాల శివ, దేవిశ్రీప్రసాద్, అనిల్ రావిపూడి, రవితేజ, అఖిల్, సుశాంత్, నాగశౌర్య, సురేందర్ రెడ్డి, శర్వానంద్, గుణశేఖర్, శ్రీనువైట్ల, నారా రోహిత్ వంటి ప‌లువురు ప్రముఖులు శుభాకాంక్ష‌లు తెలియచేశారు.

మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. ‘మ‌న‌కు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన వీరుల త్యాగాల‌ను గుర్తు తెచ్చుకుందాం. వారు మ‌న‌కోసం సంపాదించిన విలువైన స్వేచ్ఛ‌ను కాపాడుకుందాం’.. అని అన్నారు.



‘కొత్త ఆరంభం ప్రారంభమైన రోజు… స్వాతంత్ర్యం మనకి గొప్ప విజయంగా మారినప్పుడు స్వేచ్ఛ మ‌న‌కు దారిని చూపిస్తుంది. ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండండి. నాతోటి భార‌తీయులంద‌రికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’.. అని మ‌హేష్ ట్వీట్ చేశారు.

 

Balakrishna

 




Related Posts