లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

డేంజర్ బెల్స్‌లో వెడ్డింగ్ బెల్స్..

Published

on

Tollywood Celebrities Wedding: వరల్డ్ మొత్తం కరోనాతో లాక్‌డౌన్‌లో డేంజర్ బెల్స్ మోగిస్తుంటే.. సినిమా వాళ్లు మాత్రం వెడ్డింగ్ బెల్స్ మోగిస్తున్నారు. ఫస్ట్‌లో కరోనా తగ్గాక చేసుకుందాం అనుకున్నవాళ్లు కాస్తా.. ఇప్పుడప్పుడే ఆ ఛాన్సులేదని తెలుసుకుని.. కామ్‌గా కరోనా టైమ్‌లోనే కళ్యాణం కానిచ్చేస్తున్నారు. అంతేకాదు, చేసుకుందాం అనుకున్నవాళ్లు కూడా పనులు చకచకా కానిచ్చేస్తున్నారు.


కరోనా మా ప్రేమను ఆపలేదు.. మా పెళ్లిళ్లని అసలే ఆపలేదు అనుకుంటూ ప్రేమలు, పెళ్లిళ్లతో కరోనా టైమ్‌లోనే ఎంగేజ్ అయిపోతున్నారు స్టార్లు. సినిమాలు, షూటింగులు పెద్దగా లేకపోయినా, పెళ్లిల్లతో ఎప్పుడూ న్యూస్‌లోనే ఉంది సినిమా ఇండస్ట్రీ. లేటెస్ట్‌గా కాజల్ అగర్వాల్ కూడా ఈ పాండమిక్ టైమ్‌లోనే పెళ్లి చేసుకుని సెటిలై పోయింది. ముంబైకి చెందిన బిజినెస్‌మెన్, ఫ్రెండ్ అయిన గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది.

Kajal Aggarwalటాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ రానాకూడా తన ప్రేయసిని సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి పరిచయం చేసేసి సర్‌ప్రైజ్ చేశారు. డిజైనర్ మిహీక బజాజ్‌తో కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్న రానా.. కరోనా తగ్గాక ఈ ఇయర్ ఎండ్‌కి పెళ్లి చేసుకుందామనకున్నారు. కానీ ఇప్పుడప్పుడే కోవిడ్ ప్రభావం తగ్గేలా లేదనుకుని ఆగస్ట్ 8న కరోనా పీక్స్‌లో ఉన్న టైమ్‌లోనే పెళ్లి చేసేసుకున్నారు.మొన్నీమధ్యే బ్యాచిలర్ లైఫ్ నుంచి భర్తగా మారాడు యంగ్ హీరో నిఖిల్. తను కొంతకాలంగా ప్రేమిస్తున్న డాక్టర్ పల్లవిని పెళ్లి చేసుకుని మే 13 న ఓ ఇంటివాడయ్యారు. కరోనా వచ్చినా, లాక్‌డౌన్ చేసినా మా పెళ్లి మాత్రం జరిగే తీరుతుందని ముందునుంచి అంటూనే ఉన్న నిఖిల్ అన్నట్టుగానే పోస్ట్ పోన్ చేసుకోకుండా పెళ్లి కానిచ్చేశాడు ఈ యంగ్ హీరో.

మరో యంగ్ హీరో నితిన్ కూడా షాలిని కందుకూరిని ప్రేమించి ఫిబ్రవరి‌లోనే ఎంగేజ్‌మెంట్ చేసేసుకున్నారు. ఏప్రిల్ 16 న దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ లాక్‌డౌన్‌తో పెళ్లి పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే ఈ లాక్‌డౌన్ ఇప్పుడప్పుడే అయిపోయేలా లేదు కాబట్టి.. బంధువులతో జూలై 26 న పెళ్లితంతు కానిచ్చేశారు.

Nithin Wedding Photos: నితిన్ పెళ్లి వేడుక ఫొటోలు | News in Teluguఇక మెగా డాటర్ నిహారిక పెళ్లి కూడా ఈ సంవత్సరమే జరగబోతోంది. ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసేసుకున్నారు. డిసెంబర్‌లో పెళ్లి ప్లాన్ చేస్తున్నారు ఇరు కుటుంబాలవారు. తనకు కాబోయే భర్త చైతన్య ఫొటోస్ సినిమాటిక్‌గా రివీల్ చేసిన నిహారిక.. లేటెస్ట్‌గా పెళ్లి వేడుకలకు సంబందించి ఫ్యామిలీతో కలిసి ఉన్న పిక్స్ కూడా పెట్టేసి సర్‌ప్రైజ్ చేసింది.

Niharika Konidela's Purple Embroidered Engagement Lehenga You'll Want to Wear at Your Wedding

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా.. ఇప్పటికే 33 వచ్చేశాయి…ఇంకెన్నాళ్లని పెళ్లి చేసుకోకుండా తప్పించుకుని తిరుగుతాం..? తర్వాత చేసుకుంటానని చెబితే ఇంట్లో కొట్టేలా ఉన్నారంటూ.. మ్యాగ్జిమమ్ ఈ సంవత్సరమే పెళ్లి చేసేసుకుంటానంటూ పెళ్లికి రెడీ అని చెప్పేశాడు.. ఏదో ఇంట్లో గోలకి ఓకే అన్నాను కానీ అప్పుడే పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదని కూడా చెప్పాడు సాయితేజ్.


చూడ్డానికి ఇంకా కాలేజ్ బాయ్‌లా కనిపించే.. లవర్ బాయ్ రాజ్ తరుణ్ కూడా పెళ్లికి రెడీ అయిపోతున్నాడు. విజయవాడకు చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నానని… ఆల్రెడీ ఇంట్లో చెప్పి.. పెద్దవాళ్లని కూడా ఒప్పించేశామని.. పెళ్లి చేసుకోవడమే లేటని అంటున్నాడు. అయితే ఈ హీరో కరోనా వెళ్లేంత వరకూ వెయిట్ చేస్తాడో లేక అందరిలా త్వరలో ముహూర్తం పెట్టేసుకుంటాడో చూడాలి. ఇలా సినిమా వాళ్లకి షూటింగులు, రిలీజ్‌లు పెద్దగా లేకపోయినా.. పెళ్లిళ్లతో కళ కళలాడుతూనే ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *