లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

టాలీవుడ్‌లో కరోనా కల్లోలం.. వైరస్ బారినపడుతున్న టాప్ సెలబ్రిటీలు..

Published

on

Covid-19-Tollywood: ప్రపంచంలో రోజురోజుకీ కరోనా కల్లోలం పెరిగిపోతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఏదొక రూపంలో సామన్యుల దగ్గరనుంచి సెలబ్రిటీల వరకూ అందర్నీ కలవరపెడుతోంది కరోనా వైరస్. ముఖ్యంగా టాలీవుడ్‌లో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. చిన్న నటుల దగ్గరనుంచి పెద్దస్టార్ల వరకూ కరోనా బారిన పడుతున్నారు .
సెలబ్రిటీలు ఎప్పుడూ లేనంతగా ముందుకొచ్చి ఇనీషియేటివ్ తీసుకుని మరీ కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ అభిమానులకు పిలుపునిస్తున్నారు. కానీ ఈ మహమ్మారి ఏదొక రూపంలో వాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉంది.
మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు

ఇంత మంది కరోనా ప్రమాదంలో చిక్కుకున్నా పెద్దగా భయపడలేదు కానీ లేటెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవికి కోవిడ్ పాజిటివ్ రావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిరు, నాకు పాజిటివ్ వచ్చింది.. హోమ్ క్వారంటైన్‌లోనే ఉన్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఇండస్ట్రీ వర్గాల వారు, ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు కరోనాను నుంచి కోలుకుని ప్లాస్మా డొనేట్ చేశారు.

రిలీజ్‌కి ముందే రికార్డులు సెట్ చేస్తున్నారు!
కోలుకున్న రాజశేఖర్

అలాగే యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఫ్యామిలీ కూడా కరోనాతో సఫర్ అవుతోంది. కోవిడ్ పాజిటివ్‌తో హాస్పటల్‌లో జాయిన్ అయిన రాజశేఖర్ తాజాగా డిశ్చార్జ్ అయ్యారు.. జీవితకు కూడా కరోనాకి ఎటాక్ అయినా ఈమధ్యనే నెగెటివ్ రావడంతో కోలుకున్నారు.

మిల్కీ బ్యూటీనూ వదలని మహమ్మారి

మిల్కీ బ్యూటీ తమన్నా కూడా మొన్నటివి మొన్ననే కరోనా నుంచి బయటపడింది. షూటింగ్‌కి అటెండ్ అవ్వడానికి హైదరాబాద్ వచ్చిన తమన్నాకు కోవిడ్ ఎటాక్ అయ్యింది. పెద్దగా హెల్త్ ఇష్యూస్ లేకపోయినా.. తగ్గేంత వరకూ హాస్పిటల్‌లోనే ఉండి ట్రీట్‌మెంట్ చేయించుకుంది తమన్నా.
రాజమౌళి-కీరవాణి ఫ్యామిలీలకూ

అటు తమిళ్‌తో పాటు తెలుగు సినిమాలు కూడా చేస్తున్న విశాల్‌, అతని తండ్రి జికె రెడ్డికి కూడా కోవిడ్ ఎటాక్ అవడంతో హోమ్ క్వారంటైన్‌లోనే ఉండి క్యూర్ అయ్యారు. అలాగే స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పాటు కంప్లీట్ ఫ్యామిలీకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఫ్యామిలీకి కూడా పాజిటివ్ రావడంతో టాలీవుడ్ జనాలు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. వీళ్లందరూ హోమ్ క్వారంటైన్‌లోనే ఉండి కరోనా నుంచి బయటపడ్డారు. అలాగే ప్లాస్మా దానం చేశారు కూడా. ఇలా వరుసగా టాలీవుడ్ స్టార్లందరూ కరోనా బారిన పడుతుండడం.. పెద్ద సినిమాల షూటింగులు వాయిదా పడడంతో తెలుగు పరిశ్రమలో ఆందోళన నెలకొంది.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *