Home » రాజీనామా చేస్తా : ‘మా’ తీరుపై మండిపడ్డ పృథ్వీ
Published
1 year agoon
By
madhuమా తీరుపై నటుడు పృథ్వీ మండిపడ్డారు. తాను రాజీనామా చేస్తానని, ఈసీ మెంబర్ పదవి అక్కర్లేదంటూ వ్యాఖ్యానించారు. ఈసీ మెంబర్ గా గెలిచినందుకు బాధ పడాలో..సంతోష పడాలో అర్థం కావడం లేదన్నారు. 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరికి అవమానం జరిగిందని, ఆయన కంటతడి పెడుతూ వెళ్లిపోయారని పృథ్వీ 2019, అక్టోబర్ 20వ తేదీ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి వారు గ్రూపులు పెట్టుకున్నారని, సినీ పెద్దలు జోక్యం చేసుకుంటేనే సమస్యలు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇటీవలే మా అసోసియేషన్ కు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మా అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నరేశ్ గెలుపొందారు. ప్రత్యర్థి శివాజీ రాజాపై ఆయన 69 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ పై హీరో రాజశేఖర్ విజయం సాధించారు. వైఎస్ ప్రెసిడెంట్లుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, జాయింట్ సెక్రటరీలుగా గౌతమ్ రాజు, శివ బాలాజీ, ట్రెజరర్ గా రాజీవ్ కనకాల, మా సభ్యులుగా ఆలీ, రవి ప్రకాశ్,న తనికెళ్ల భరణి, సాయి కుమార్, ఉత్తేజ్, పృథ్వీ, జాకీ, సురేశ్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్ఝ, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మీ, కరాటే కళ్యాణి, పసునూరి శ్రీనివాస్ విజయం సాధించారు.
ఇక పృథ్వీ విషయానికి వస్తే..30 ఇయర్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో పాపులర్ అయ్యాడు. వెరైటీగా కామెడీ చేస్తూ అభిమానులను అలరించాడు. 2019 ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. నటుడు పృథ్వీకి సీఎం జగన్ కీలక పదవి ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ గా నియమించారు. అయితే..కొన్ని కాంట్రవర్సిలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు పృథ్వీ. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపుతాయో చూడాలి.