లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

టాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్స్

Published

on

Tollywood Multi Starrer Movies: ఒక్క హీరో యాక్షన్ సరిపోవడం లేదు ఆడియన్స్‌కి.. అందుకే ఇద్దరు ముగ్గురు స్టార్లతో సినిమాల్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అది కూడా ఏదో పెద్ద హీరో, చిన్న హీరో కాదు.. విజయ్-బన్నీ, పవన్ -రానా లాంటి టాప్ స్టార్స్‌తో భారీ బడ్జెట్‌తో క్రేజీ మల్టీస్టారర్స్ ఊపందుకుంటున్నాయి. వీటితో పాటు తెలుగులో తెరకెక్కుతున్న మల్టీస్టారర్స్ ఏంటో చూద్దామా..

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ ఊపందుకుంటోంది. ఒక్క హీరో కన్నా ఇద్దరు హీరోలతో సక్సెస్ గ్యారంటీ రేట్ కాస్త ఎక్కువే ఉండడంతో మల్టీస్టారర్స్‌కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్య మల్టీ ట్రెండ్ ఆసక్తికరంగా ఉండడంతో టాప్ హీరోలు కూడా వేరే హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోడానికి ఓకే చెబుతున్నారు. లేటెస్ట్‌గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ-అల్లు అర్జున్ కాంబినేషన్లో క్రేజీ మల్టీస్టారర్ చర్చ నడుస్తోంది.

అల్లు అరవింద్ ప్రొడక్షన్స్‌తో పాటు మరో టాప్ ప్రొడ్యూసర్‌తో కలిపి భారీ బడ్జెట్‌తో మహి.వి. రాఘవ డైరెక్షన్లో ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మల్టీస్టారర్ పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ టాలీవుడ్ న్యూస్.

బన్నీ-విజయ్ మల్టీస్టారర్‌తో పాటు ఎప్పుడెప్పుడొస్తుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’.. టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అదిరిపోయే విజువల్స్‌తో అంతకుమించిన భారీ బడ్జెట్‌తో అక్టోబర్ 13 న ఆడియన్స్ ముందుకురాబోతోంది.

పృథ్వీరాజ్, బిజు మీనన్ నటించిన హైలీ యాక్షన్ ఎలివేటెడ్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’. తెలుగులో రీమేక్ అవుతున్న ఈ సినిమాలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. సాగర్ కె. చంద్ర డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్‌లో క్రేజీ మల్టీస్టారర్‌గా స్టార్ట్ అవ్వకముందు నుంచే ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్ సంపాదించుకుంటోంది. పవర్‌స్టార్ క్రేజ్‌కి, రానా ఎఫర్ట్‌లెస్ యాక్టింగ్‌ని తెరమీద చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఈ సూపర్ కాంబినేషన్స్‌తో పాటు టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటింగ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మూవీ ‘ఆచార్య’. కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కాజల్, సోనూ సూద్.. ఇలా ఫుల్ ప్యాకేజ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద రోజురోజుకీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతూనే ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా సెట్స్ వీడియోతో అటు చిరంజీవి, కాజల్, క్రేజీ లుక్‌తో సిద్ద గా తన క్యారెక్టర్ రివీల్ చేసి రామ్ చరణ్ సినిమా మీద హైప్స్ క్రియేట్ చేసేశారు. ‘ఆచార్య’ లో తండ్రీ కొడుకులు చిరంజీవి, చరణ్ కలిసి ఫ్యాన్స్‌కి విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌ని ఈ నెల 29 న రిలీజ్ చేస్తున్నారు.

టాప్ స్టార్స్‌తో పాటు మరో సూపర్ హిట్ కాంబినేషన్ కూడా ఈ సంవత్సరమే తెరమీదకి రాబోతోంది. ‘ఎఫ్ 2’ కి సీక్వెల్ గా వస్తున్న ‘ఎఫ్ 3’ సినిమాలో కూడా వెంకటేష్ -వరుణ్ తేజ్, తమన్నా-మెహరీన్ ని రిపీట్ చేస్తూ.. మోర్ ఫన్‌ని క్రియేట్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. దీనికి సంబందించి షూటింగ్ చకచకా కంప్లీట్ చేసే పనిలో ఉంది యూనిట్..