లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

రోడ్డు ప్రమాదంలో దర్శకుడికి తీవ్రగాయాలు

Published

on

road accident in america, 3 hyderabad shot dead

రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ దర్శకుడు మల్లికార్జునరావు తీవ్రంగా గాయపడ్డారు. రెండేళ్ల క్రితం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు మల్లికార్జున రావు. దాంతో పాటు సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. మల్లికార్జున రావు వయసు 57 ఏళ్లు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

అయితే తీవ్రగాయాలు కావడంతో కొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. విషయం తెలిసి సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు, దర్శకులు ఆసుపత్రికి వెళ్లి మల్లికార్జున రావుని పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. డాక్టర్లను అడిగి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తెలుగు దర్శకుల సంఘం తరఫు నుంచి ఆయనకు తమ మద్దతు తెలిపారు పలువురు దర్శకులు. 

 

ss

 

కాగా, టాలీవుడ్ లో ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. గత నెలలో ఓ సీనియర్ నిర్మాత ఇలాగే రోడ్డు యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయారు. హరికృష్ణ రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. రీసెంట్ గా సీనియర్ హీరో రాజశేఖర్ రోడ్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు మల్లికార్జు రావు. ఇలా వరుసగా సినీ ప్రముఖులు రోడ్డు యాక్సిడెంట్ల బారిన పడుతుండటం జరుగుతోంది.

Also Read : రూ.1200కోట్లు వసూల్: దృశ్యం సినిమా చైనాలో రీమేక్

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *