Tollywood Directors Making Stories for Megastar Chiranjeevi

రేసుగుర్రం 2.O – చిరు స్పీడు మామూలుగా లేదుగా..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చెయ్యడానికి సీనియర్ దర్శకులతో పాటు ఇప్పటి యువ దర్శకులు కూడా కథలు తయారు చేస్తున్నారు..

మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ మామూలుగా లేదు. సెకండ్ ఇన్నింగ్స్ కదా.. స్లో గా వెళ్దాం అనుకోకుండా స్టోరీల విషయంలో యమా స్పీడు మీదున్నాడు. అందుకే డైరెక్టర్లు కూడా ఇదే మంచి టైమ్ అనుకుని చిరంజీవిని ఇంప్రెస్ చేసే కథలతో రెడీ అవుతున్నారు. సీనియర్ డైరెక్లర్లు సుకుమార్ దగ్గరనుంచి యంగ్ డైరెక్టర్ పరశురామ్ వరకూ అందరూ మెగాస్టార్ మీదే కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. 

చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాలతో సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో భారీ స్టార్ క్యాస్ట్‌తో తెరకెక్కుతున్న కొరటాల సినిమాలో చిరంజీవి ఆడియన్స్‌కి సరికొత్తగా కనిపించబోతున్నాడు. ‘సైరా’ కి రెండు సంవత్సరాలు టైమ్ తీసుకున్న చిరంజీవి.. ఈ సినిమాని 100 రోజుల్లోపే కంప్లీట్ చెయ్యమని కొరటాల దగ్గర మాట తీసుకున్నాడు.

మరి ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయ్యి నెల అయిపోతోంది. ఈ సినిమా ఇలాగే ఫాస్ట్‌గా ఫినిష్ చేస్తే.. ఇంకా రెండు నెలలు షూట్ మాత్రమే. అందుకే కొరటాలతో సినిమా కంప్లీట్ అవ్వకముందే నెక్ట్స్ చెయ్యబోయే కథల గురించి ఆరా తీస్తున్నాడు చిరు. మెగా స్టార్‌తో సినిమా చేద్దామని కలలు కంటున్న డైరెక్టర్లు కూడా చిరంజీవి మీద కాన్సన్‌ట్రేట్ చేసి కథలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్‌తో సినిమా చేస్తానని చిరు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి మాటలకు ఫుల్ ఖుష్ అయిపోయిన త్రివిక్రమ్.. ఇప్పటికే స్టోరీతో రెడీగా ఉన్నాడు.

మెగా స్టార్‌తో సినిమా చేద్దామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సుకుమార్  చిరంజీవి కోసం కథ రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం బన్నీతో సినిమా చేస్తున్న సుకుమార్ నెక్ట్స్ మెగాస్టార్ సినిమా మీదే ఫోకస్ చేస్తున్నాడు. ఆయన మెచ్చే ఎలిమెంట్స్‌తో మంచి స్టోరీతో సిధ్దమతున్నాడు. ‘గీతగోవిందం’ తో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసిన పరశురామ్ కూడా మెగాస్టార్‌తో సినిమా కోసం పడిగాపులు పడుతున్నాడు. మెగాస్టార్‌కి మ్యాచ్ అయ్యే స్టోరీతో ఆయన్ని ఒప్పించే టైమ్ కోసం ఎదురు చూస్తున్నాడు. 

అంతేకాదు.. ఎప్పటినుంచో పూరీ జగన్నాధ్ కూడా చిరంజీవితో ఎప్పటినుండో సినిమా చేద్దామనుకుంటున్నాడు. ఎప్పటికైనా చిరుతో సిినిమా చేసే తీరతానని పలుమార్లు మీడియా ముందే చెప్పాడు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.

ఈ మద్య హెవీ మూవీస్‌తో పాటు.. హిస్టారికల్ సినిమాలు చేస్తున్న క్రిష్ కూడా చిరంజీవి మీద కాన్సన్‌ట్రేట్ చేసి కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు.  ఇంత మంది సీనియర్లతో పాటు యంగ్ డైరెక్టర్లు మెగాస్టార్‌తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి చిరంజీవి ఏ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.
 
 

Related Posts