ఫుల్ బిజీలో టాలీవుడ్.. టాప్ డైరక్టర్ల చేతి నిండా బడా హీరోల సినిమాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అసలే కరోనా కాలం.. ఆపై షూటింగులు లేవు. షూటింగులు అయినా కూడా రిలీజ్ చెయ్యడానికి థియేటర్లు లేవు. అయినా కూడా మన డైరెక్టర్లు .. ప్యూచర్ ప్రాజెక్ట్స్‌ని పుల్‌గా ప్లాన్ చేసుకున్నారు. టాప్ డైరెక్టర్లందరూ .. స్టార్ హీరోలతో సినిమాలు లాక్ చేసుకుని షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

షూటింగ్‌కి ఎప్పుడెళ్దామా అని డైరెక్టర్లు, సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని హీరోలు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు ఇప్పుడప్పుడే జరిగేలా లేవని.. ఖాళీగా ఉండడం ఎందుకని కథలు వింటూ హీరోలు, హీరోల్ని ఇంప్రెస్ చేసే స్టోరీలతో ఛాన్సులు కొట్టేద్దామని డైరెక్టర్లు తెగ బిజీగా ఉన్నారు. ఆ ప్రాసెస్ లోనే టాప్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు కలిసి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ని లైనప్ చేసేసుకుంటున్నారు.

ప్రజెంట్ చేస్తున్న సినిమాలు ఇంకా ఫినిష్ అవ్వకుండానే నెక్ట్స్ సినిమాలు సిద్దం చేసేసుకున్నారు డైరెక్టర్లు. రాక రాక వచ్చిన లాక్‌డౌన్‌ని ఫుల్‌గా వాడేసుకుంటున్నారు మన దర్శకులు. అందుకే చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల.. బన్నీతో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసేశారు. అసలు ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడెప్పుడు తెరమీద చూద్దామా అని ఇప్పటినుంచే వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.

స్టార్ డైరక్టర్ రాజమౌళి కూడా ట్రిపుల్ కంప్లీట్ కాకుండానే నెక్ట్స్ సినిమా అనౌన్స్ చేసేశారు. మహేష్ బాబు, రాజమౌళి.. ఈ రేర్ కాంబినేషన్‌ని అసలు ఆడియన్స్ కూడా ఊహించి ఉండరు. అలాంటిది సర్‌ప్రైజింగ్‌గా సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసేశారు రాజమౌళి.

మరో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా నెక్స్ట్ సినిమాని లాక్ చేసుకున్నారు. ఫ్యామిలీ వాల్యూస్ కి తన స్టైలిష్ మేకింగ్ ని యాడ్ చేసి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే మాటల మాంత్రికుడు కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమాని లైనప్ చేశారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో అంతకుముందొచ్చిన అరవింద సమేత సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పటికే సూపర్ క్రేజ్ వచ్చేసింది ఫ్యాన్స్‌లో.

చేసినవి రెండు సినిమాలే అయినా.. క్రేజ్ తెచ్చుకోవడంలో టాప్ డైరెక్టర్ల సరసన చేరిపోయారు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రహ్యణ్యం, మహానటి తర్వాత ఎలాంటి సినిమా చెయ్యబోతున్నారో అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కి ప్రభాస్‌తో ఫ్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు నాగ్ అశ్విన్.

మణికర్నిక తర్వాత తెలుగు సినిమా టచ్ చెయ్యని క్రిష్ కూడా నెక్ట్స్ సినిమా స్టార్ట్ చెయ్యబోతున్నారు. చాలా కాలం తర్వాత స్టార్ హీరో వపన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు క్రిష్. పేరెత్తగానే వెర్రెక్కిపోయే ఫ్యాన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని క్రిష్ ఎలా తెరమీదకెక్కిస్తా రా అనేది ఇంట్రస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ .

READ  రూలర్ సినిమా లేటెస్ట్ రివ్యూ... ఫస్ట్ డే కలెక్షన్స్

బ్యాక్ టూ బ్యాక్ రీమేక్ సక్సెస్ లు కొడుతున్న మరో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ డైరెక్టర్ కూడా పవర్ స్టార్ తో సినిమా లైనప్ చేశారు. పవన్ కళ్యాణ్ 28 వ సినిమాని ఆడియన్స్ మర్చిపోలేని రేంజ్ లో తీస్తానంటూ ఆల్రెడీ అనౌన్స్ చేశారు హరీష్ శంకర్. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ సక్సెస్ అయ్యింది. అందుకే ఈ సినిమా మీద కూడా ఎక్స్ పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. ఇలా టాప్ డైరెక్టర్లు .. స్టార్ డైరెక్టర్లతో లాక్ డౌన్ లో సినిమాల్ని లైన్లో పెట్టేసుకుని ఫ్యూచర్ ప్లాన్స్ కి అన్నీ సిద్దం చేసుకుంటున్నారు.

Related Posts