లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

హీరోలంతా ఎవరి బిజీలో వారు ఉన్నారు..

Published

on

Tollywood Movies: టాలీవుడ్ హీరోలంతా ఎవరి బిజీలో వారు ఉన్నారు.. షూటింగ్స్ అన్నీ జోరుమీదున్నాయి.. ఎన్టీఆర్ – రామ్ చరణ్-రాజమౌళి.. కాంబినేషన్ మూవీ.. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి-కొరటాల కాంబినేషన్ మూవీ ‘ఆచార్య’ కోకాపేటలో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. ‘ఆచార్య’ సెట్‌లోకి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ జాయిన్ అయ్యారు. ఈ మూవీలో ఆయన సిద్ధ క్యారెక్టర్ చేయబోతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్..

Acharya

రెబల్ స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా జనవరి 21 నుంచి 3 రోజులు అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఆ తరువాత 25 నుంచి ఫిబ్రవరి 10 వరకు రామగుండంలో జరుగనుంది. ఇక అల్లు అర్జున్-సుకుమార్ ‘పుష్ప’ సినిమా షూట్ సూపర్ ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతోంది. ప్రస్తుతం మారేడుమిల్లి ఫారెస్ట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈషెడ్యూల్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకూ జరిగే అవకాశం ఉంది.

Salaar

‘క్రాక్’ హిట్ జోష్‌లో ఉన్న రవితేజ తన నెక్ట్స్ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. రమేష్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఖిలాడి’ సినిమా షూట్ వైజాగ్‌లో జరుగుతుంది. జనవరి 22 వరకు ఈ షెడ్యుల్ కంటిన్యూ అవబోతోంది. ఇక చివరి దశలో ఉన్న వెంకటేష్ ‘నారప్ప’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో జరుగుతుంది.

Khiladi
వరుస సినిమాలతో మంచి జోరు చూపిస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ‘శ్యామ్ సింగ రాయ్’ ను సూపర్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేయబోతున్నాడు. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంక్రిత్యాన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌‌లోని మాదాపూర్ హౌజ్‌లో జరుగుతుంది. రీసెంట్‌గా ‘టక్ జగదీష్’ కంప్లీట్ చేసిన నాని.. ఎప్రిల్ 16 న సినిమా రిలీజ్ చేయబోతున్నాడు.Nani

ఇక అక్కినేని వారసులు.. నాగ చైతన్య- అఖిల్ ఇద్దరూ హైదరాబాద్‌లోనే షూటింగ్ చేసుకుంటున్నారు. నాగచైతన్య-విక్రమ్ కుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘థాంక్యూ’ సినిమా జీడిమెట్లలోని మల్లారెడ్డి కాలేజ్‌లో జరుగుతుంటే.. అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబో మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా పెండింగ్ వర్క్స్ షూటింగ్ మాదాపూర్ విక్రమ్ హాస్పిటల్ ద్దగ్గరలో జరుగుతుంది.

Love Story

యంగ్ హీరోస్ అంతా హైదరాబాద్‌లోనే తమ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. మ్యాచో హీరో గోపీచంద్-సంపత్ నంది డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘సీటీమార్’ సినిమా షూట్ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇక నిఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ‘18 pages’ హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. సిక్స్ ప్యాక్ సిక్స్ ఫీట్ హీరో కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ మూవీ షూటింగ్ హైదరాబాద్ సారథి స్టూడియోస్‌లో జరుగుతుంది.

Gopichand