ప్రియమైన అభిమానుల్లారా..మహేష్ బాబు విజ్ఞప్తి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తమ అభిమాన స్టార్ పుట్టిన రోజు వస్తుందంటే..చాలు..ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు. సామాజిక కార్యక్రమాలు చేయడం, స్వీట్లు పంచడం, పటాకులు కాల్చడం..వంటి సంబరాలు జరుపుతూ..సంతోషంగా గడుపుతుంటుంటారు.కానీ..కరోనా నీళ్లు చల్లింది. ఎలాంటి వేడుకలు జరుపొద్దని ఫ్యాన్స్ కు పిలుపునిస్తున్నారు. ఇలాగే..టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడ పిలుపునిచ్చాడు. ఆగస్టు 09వ తేదీన ఆయన జన్మదినం. ఈ సందర్భంగా 2020, ఆగస్టు 07వ తేదీన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. వేడుకలకు దూరంగా ఉంటూ..ఇంట్లోనే క్షేమంగా ఉండాలన్నారు.ఎంతో మంది అభిమానులు తోడుగా ఉండడం తన అదృష్టం. ఆ రోజు ప్రత్యేకమైన రోజుగా ఉండాలని ఫ్యాన్స్ ప్రయత్నాలు, పనులు చేస్తుండడం తనకు సంతోషంగా కలిగిస్తుంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల అందరూ సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఉంది. తన పుట్టిన రోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా.మహేష్ బాబు న్యూ ఫిల్మ్ గురించి ఏదైనా విషయం తెలుస్తుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మహేష్ – పరశురాం కాంబినేషన్‌లో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతోంది. మరి మహేష్ బర్త్ డే సందర్భంగా ఏదైనా ట్రీట్ చేస్తారో చూడాలి.

Related Posts