లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

విశాఖ ఉక్కుకు యంగ్ హీరో సపోర్ట్.. పిడికిలి బిగిద్దాం.. ఆంధ్రుడి హక్కు కోసం నినదిద్దాం!

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు విషయంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు అన్నీ దాదాపుగా ఒకే తాటిమీదకు వచ్చేశాయి. ఈ క్రమంలోనే.. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా యంగ్ హీరో నారా రోహిత్ తన మద్దతును విశాఖ ఉక్కు కోసం తెలిపాడు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఉద్యమానికి మద్దతుగా ఫేస్‌బుక్ పోస్ట్ చేసి తన మద్దతును సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

“కూల్చడానికది ఆవాసం కాదు. అంగట్లో అమ్మడానికది వస్తువూ కాదు. త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన కర్మాగారం మన విశాఖ ఉక్కు. ఆంధ్రులు త్యాగధనులు కాబట్టే ఉక్కు పరిశ్రమ స్థాపనకు 22 వేల ఎకరాలు రాసిచ్చారు. 64 గ్రామాలను ఆనందంగా ఇచ్చేశారు. 32 మంది తృణప్రాయంగా ప్రాణత్యాగం చేశారు. నేడు ఉక్కు పరిశ్రమ ఉనికి ప్రమాదంలో పడుతోంది..”

ఆంధ్రుడా మేలుకో.. 60వ దశాబ్ధంలో పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ 21వ శతాబ్ధంలో ప్రమాదంలో పడింది. సమిష్టి కృషితో 50 ఏళ్లకు పైబడి అభివృద్ధి చేసుకున్న కార్మికుల శ్రమ శ్వేదం ప్రైవేటు పరం చేయడమేనా మన సాధించిన అభివృద్ధి? ప్రజాస్వామ్య కార్యక్షేత్రంలో పిడికిలి బిగిద్దాం. గొంతు పెగలించి విశాఖ ఉక్కు ఆంధ్రుడి హక్కు అని నినదిద్దాం.” అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు.

కూల్చడానికది ఆవాసం కాదు. అంగట్లో అమ్మడానికది వస్తువూ కాదు. త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన కర్మాగారం మన విశాఖ ఉక్కు. …

Posted by Nara Rohith on Saturday, 20 February 2021