యంగ్ హీరోలు యమస్పీడ్ మీద ఉన్నారు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Tollywood Young Heroes: టాలీవుడ్ యంగ్ హీరోలు యమస్పీడ్ మీద ఉన్నారు. సినిమాల విషయంలో సీనియర్ హీరోలకంటే వేగంగా దూసుకుపోతున్నారు. లాక్‌డౌన్ టైంలో టైం వేస్ట్ చేయకుండా.. సైలెంట్‌గా కొత్త స్క్రిప్ట్‌ల మీద వర్కౌట్స్ చేశారు. షూటింగ్స్ స్టార్ట్ అవ్వగానే.. చేతిలో ఉన్న సినిమాలు చేసుకుంటూనే కొత్త సినిమాలు ఎనౌన్స్ చేసేస్తున్నారు.

హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. సంతోష్ జాగర్లమూడి సినిమాను రీసెంట్‌గా కంప్లీట్ చేసిన శౌర్య.. వెంటనే లక్ష్మీ సౌజన్య అనే కొత్త దర్శకురాలితో సినిమాను స్టార్ట్ చేసేశాడు. అది జరుగుతుండగానే.. యంగ్ డైరెక్టర్ హనీష్ కృష్ణతో తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో సినిమా చేయబోతున్నట్టు పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు.

భీష్మ హిట్‌ను బాగా ఎంజాయ్ చేసిన యూత్ స్టార్ నితిన్ అదే జోరులో పెళ్ళి కూడా చేసేసుకున్నాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన నెక్ట్స్ సినిమాల మీద దృష్టిపెట్టాడు. గ్యాప్ లేకుండా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ జరుగుతుండగానే చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్‌లో చేయనున్న ‘చెక్’ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇక ‘రంగ్ దే’ షూట్ గ్యాప్ రావడంతో.. ‘చెక్’ సినిమాను సెట్స్ ఎక్కించాడు. అలాగే బాలీవుడ్‌లో హిట్ అయిన ‘అందాధూన్’ మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. వీటితో పాటు కృష్ణ చైతన్య దర్శకత్వంలో తన బ్యానర్లో ‘పవర్ పేట’ అనే సినిమా కూడా లైన్లో పెట్టాడు. తాజాగా ఓ యాడ్ షూట్‌లో కూడా పాల్గొన్నాడీ యూత్ స్టార్.

షూటింగులకు పర్మిషన్స్ వచ్చిన రెండు నెలల తరువాత రంగంలోకి దిగాడు యంగ్ హీరో శర్వానంద్. ‘శ్రీకారం’ కొంత బ్యాలెన్స్ ఉండగానే.. ముందుగా శ్రీకార్తిక్ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే బైలింగువల్ సినిమాను చెన్నైలో ప్రారంభించాడు. ఇంతలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్టర్ సిద్ధార్థ్‌తో కలిసి ‘మహాసముద్రం’లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అక్కినేని యంగ్ హీరో అఖిల్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయ్యేలోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కొత్త ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశారు. దసరా నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు రాబోతుంది.

Related Posts