శృంగారానికి సమయంలేదు, ఓపిక లేదనేవాళ్లు పడకగదిని, ఆఫీసు పనిని బ్యాలెన్స్ చేయగలరా? సైన్స్ దగ్గర సమాధానముంది!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శృంగారపు కోరికలు ఉరకలేస్తున్నా.. పనిలో బిజీగా ఉంటున్నారా? పని ఒత్తిడితో శృంగారానికి సమయమే లేదా? .. బాబూ చాలా బిజీగా గడిపేస్తున్నాడే? అని ఫీల్ అవుతుంటారు.. ఇంతకీ ఇలాంటి వాళ్లు అసలు పడక గదిని, ఆఫీసు రూంని బ్యాలెన్స్ చేయగలరా? అలా రెండింటిని హ్యాండిల్ చేయాలంటే.. ఈ విషయంలో సైన్స్ ఏం చెబుతోంది. ఎలాంటి సలహాలు సూచనలు చేస్తోంది.

ఈ విషయంలో సెక్సాలిజిస్టులు, సైకాలిజిస్టులు ఏమంటున్నారు?.. నిత్య కోరికలు బుస్సలు కొడుతున్నా పని ఒత్తిడి కారణంగా శృంగారాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నామని ఆవేదన చాలామందిలో కనిపిస్తుంటుంది. బయటకు కనిపించకపోయినా వారిలో నిరుత్సాహం కొట్టచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది.

ఇలాంటి వారిలో శృంగారంపై ఆసక్తిని పెంచడమే కాకుండా బిజీ లైఫ్ లో వర్క్ తో పాటు రిలేషన్ ఎలా బ్యాలెన్స్ చేయవచ్చునో పలు ప్రశ్నలకు సెక్సాలిజిస్టులు సూచించే సమాధానాలేంటో ఓసారి పరిశీలిద్దాం..
Too tired and busy for sex these tips to improve your sex lifeప్రశ్న : నేను ఎప్పుడూ తీవ్ర అలసటతో ఉంటాను లేదా శృంగారంలో తెగ బిజీగా గడిపేస్తుంటాను. నా పార్టనర్ తో కలిసిన సమయంలో అతడి భుజాలపై నేను వాలినప్పుడు నాలో అనిపించే భావన ఒకటే.. శృంగారాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి? వర్క్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ రెండింటిలో ఎక్కువగా దేనికి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలంటారు?

సమాధానం : మంచి ప్రశ్న… ఇలాంటి పరిస్థితులను చాలామంది జంటలు వారి బిజీ లైఫ్ లో నిత్యం ఎదుర్కొంటునే ఉంటారు. నాకు దగ్గరకు వచ్చే చాలా మంది క్లయింట్స్ కూడా ఇదే విషయాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. వచ్చిన వారిందిరికి నేనిచ్చే సమాధానం ఒక్కటే… మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది.. దాన్ని అనుసరించే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోవచ్చు.

శృంగారంపై ఆశ.. మిమ్మల్ని కౌగిళ్లలో బందీని చేస్తుంది :
ప్రతిఒక్కరిలోనూ శృంగారంపై ఆశ ఉంటుంది. అది వారిలో పరిస్థితుల అనుకూలతను బట్టి బయటపడుతుంది. మనలో చాలామందిలో శృంగారమంటే అదేదో అప్పటికప్పుడూ కలిగే సులభమైన భావనగా భావిస్తుంటారు. హనీమూన్ సమయంలోనూ కొత్త జంటల్లో ఇదే తరహా ఉద్వేగం ఎదురవుతుంది. ఆ సమయంలో శరీరంలో విడుదలయ్యే సులభమైన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.

శృంగారం చేయడం ఎంతో సులభం అనే భావన మనలో ఉన్నప్పుుడు వారిలో మరింత ఆనందాన్ని ఆస్వాధించేలా ప్రేరేపిస్తుంది. బలవంతపు ప్రయత్నం లేకుండానే సాధారణమైన లైంగిక చర్యగా కొనసాగాలని భావిస్తుంటారు. ఎప్పుడూ బిజీగా ఉండే సమాజంలో జీవిస్తున్నాం.. ఇబ్బందికర పరిస్థితుల్లో జీవనం సాగిస్తుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో పేరెంటింగ్ అనేది ఒక పనిగా మారింది. ఆఫీసుల్లోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. ఇలాంటి వారి జీవితంలో రిలేషన్ సంబంధిత సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంతకీ పనికి ప్రాధాన్యత ఇవ్వాలా? లేదా శృంగారానికా అంటే రెండూ ముఖ్యమైనవేనని అంటున్నారు సైకాలిజిస్టులు..

READ  ఇంట్లో పనిచేయడం కంటే.. ఆఫీసుల్లో వర్క్ ఎంతో బెటర్ అంటున్న యువత..!

చాలామందికి తమ సన్నిహిత సంబంధం కంటే పని లేదా సంతానానికి ప్రాధాన్యత ఇస్తారు. జంటలతో కలిసి పనిచేస్తున్నప్పుడు, వారి సంబంధాన్ని ప్రాధాన్యత జాబితాలో ఉండాలని సూచిస్తానని తాన్య అంటున్నారు.

అప్పడుప్పుడు ఒక పని లేదా కుటుంబాన్ని ఒక స్థాయి లేదా రెండుగా విభజించవచ్చు. కానీ, ప్రతివారం కాదనే విషయం గుర్తించుకోవాలి. మీ రిలేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడమంటే.. మీరు రోజుకు ఎనిమిది గంటలు శృంగారంలో పాల్గొంటారని కాదు.. మీ రిలేషన్ బలపడటానికి మీరో పునాది వేస్తున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

పనితో ఎప్పుడు బిజీగా ఉండే వారిలో శృంగారంపై ఆసక్తి, ఆశను ఎక్కువగా పెంచుకోవాలంటే ముందుగా ఒకరినొకరు తమ రిలేషన్‌ను కొనసాగించవచ్చు. అంతేకాదు.. సాన్నిహిత్యాన్ని మరింత కొనసాగించడానికి సెక్సాలిజిస్టులు సూచిస్తున్న ఈ కొన్ని విషయాలు సాయపడతాయని అంటున్నారు.

ప్రతి జంట గుర్తించుకోవాల్సిన విషయం : బిజీగా పనితో అలసిపోయిన జంటల్లో శృంగారం దూరం కావొచ్చు. కానీ, వారిలో రిలేషన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కేవలం శారీరక సంబంధం లేని సంబంధాల్లో నష్టం కూడా లేకపోలేదు. ఒత్తిడి, అలసట వంటి సమస్యల నుంచి బయట పడాలంటే ప్రతిఒక్క జంట కూడా లవ్ హార్మోన్లను పొందాల్సి ఉంటుంది. ఔధార్యం, కౌగిలింతలతో ముడిపడిన ఆక్సిటోసిన్ ఉత్పత్తి కాని జంటలన్నీ లవ్ హార్మోన్ సమతుల్యాన్ని కోల్పోతున్నాయిని తాన్య వివరించారు.

రిలేషన్ బాగుంటే.. శృంగారానికి పరిమితులే ఉండవు :
రిలేషన్ బాగున్నా ప్రతి జంటలో శృంగారానికి కోరికల పాన్పు పరిచినట్టే. సంబంధాన్ని బట్టే శృంగారంపై ఒక అంచనాకు రావచ్చు. మీరు అలసిపోయినట్టుగా ఉంటే.. సరిగ్గా పనిచేయగలరా? ఆరోగ్యంగా లేకుంటే 90 శాతం పని ఎలా పూర్తి చేయగలరు? అనేది గుర్తించాల్సిన విషయమే. ఇరువురు పార్టనర్లు సంతోష స్థితికి చేరుకోవడంలో 60 శాతం మేర శక్తి ఉంటే సరిపోతుంది.Too tired and busy for sex these tips to improve your sex lifeతక్కువ సామర్థ్యం ఉన్న సమయంలోనూ ఎవరికీ భావ ప్రాప్తి, ఉద్వేగం లేదని సూచించవచ్చు. లేదా మీలో ఎవరైనా హస్త ప్రయోగం చేస్తున్న సమయంలో మరొకరు స్ట్రోక్ చేసి గట్టిగా కౌగిలించుకోవచ్చు. లైంగికంగా, ఒకరినొకరు సన్నిహితంగా ఉండటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. పనితీరుపై దృష్టి పెట్టేందుకు ప్రయత్నించాలి. సరదా కోసం కొత్త ప్రదేశాలకు పార్టనర్లను తీసుకెళ్లి ఎంజాయ్ చేయడం వంటి చేయాలని సూచిస్తున్నారు.

అనుకోని శృంగారానికి సరైన ప్లాన్, సమయం అవసరమే.. :
చాలామంది జంటల్లో సన్నిహిత సంబంధాలు సమయాన్ని ప్లాన్ చేయడంలో లేదా స్థలం అనుకూలంగా లేదని అయిష్టత చూపిస్తుంటారు. అయినప్పటికీ వారి డైరీలను ఓసారి పరిశీలిస్తే.. పని, కుటుంబానికి సంబంధించి నెలల ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.

READ  మీది ఏ బ్లడ్ గ్రూపు తెలుసా? ఎలా గుర్తించాలి?

శృంగారానికి సరైన సమయం ఎంచుకోకుంటే అద్భుతంగా అనిపించదని అంటున్నారు సెక్సాలిజిస్టులు.. అనుకోని శృంగారానికి ప్లాన్ చేసుకోండి. ప్రతి వారం శారీరకంగా ఒకరితో ఒకరు కలిసేందుకు సమయాన్ని తప్పనిసరిగా కేటాయించండి. రోజుకు ఎన్ని సార్లు తరచుగా కేటాయించాలో నిర్ణయించుకోవాలి. క్రమం తప్పకుండా శృంగారం చేయాలని భావిస్తే.. సాధారణ శృంగార సమయాన్ని షెడ్యూల్ చేయడమే ఉత్తమమని సెక్సాలిజిస్టులు సూచిస్తున్నారు.

భౌతిక సంబంధం ఎలా ఉంటుందంటే?
భౌతిక సంబంధాలు అంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో లేదా ఏదైనా రద్దీ ప్రదేశాల్లో కావొచ్చు.. ఇంట్లో అయినా బయట కావొచ్చు… సందర్భాన్ని బట్టి సాన్నిహిత్యాన్ని కొనసాగించాలి. అప్పుడే పార్టనర్ల మధ్య సరైన సాన్నిహిత్యాన్ని పెంచుకోవచ్చునని అంటున్నారు. దీనికి సంబంధించి ఎన్నో సలహాలు సూచనలను అందిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

* మీరు హాయ్ లేదా బాయ్ చెప్పినప్పుడు ఒకరికొకరు 6 సెకన్ల ముద్దు ఇచ్చుకోవాలి.
* ఆకర్షణతో కూడిన ముద్దు అయి ఉండాలి. మీ భాగస్వామితో కనెక్ట్ అవ్వాలనే స్పష్టమైన ఉద్దేశమై ఉండాలి.
* ఈ ఆకర్షణ, ఉద్దేశమనేది దీర్ఘకాలం ఉండొచ్చు లేదా కొన్నాళ్లు కొనసాగించేలా నిర్ణయించుకోవాలి.

కౌగిలింతలు :
* కౌగిలింతలు శృంగారానికి పునాది లాంటివి. కారణంతో సంబంధం లేకుండా రోజువారీ విషెస్ మాదిరిగా ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవడం, కలిసి నడవడం, ప్రశంసలు కురిపించుకోవడం వంటివి చేయడాలి. అప్పుడే ఇరువురిలో సంబంధం మరింత బలపడుతుంది.. శృంగారపు కోరికలను ప్రేరేపిస్తుంది.

Too tired and busy for sex these tips to improve your sex life

కలిసి స్నానం చేయాలి :
* టబ్‌లో కలిసి స్నానం చేయడం లేదా మరో భంగిమలో చేయాలి.
* బాత్ రూంలో ఒక వైపు కూర్చుని ఉండగా మరొకరు టబ్‌లో కూర్చొని ఉండాలి.
* ముచ్చటించుకోవాలి లేదా గ్లాసు వైన్ లేదా నారింజ రసం మొదలైనవి కలిసి సేవించాలి.
* స్నానం చేసే సమయంలో మీ పార్టనర్ వెనుకభాగాన్ని నీటితో కడుగుతూ సన్నిహితంగా మెలగాలి.

కలిసి షవర్ బాత్ చేయండి :
* ఒక పార్టనర్.. మరో పార్టనర్ కలిసి షవర్ బాత్ చేయాలి.
* సరదాగా అనిపిస్తుంది.. కొంచెం అలసటగా అనిపించినా ఆనందాన్ని ఇస్తుంది.

మసాజ్ చేసుకోవడం :
* ఒకరినొకరిపై శృంగారపు కోరికలను రేకిత్తించడానికి ఇదో ఎంతో ఉత్తమం..
* ఈ వారం నీకు మసాజ్ ఇస్తాను.. వచ్చే వారం ఏదో ఒక గిఫ్ట్ కానీ, మసాజ్ చేయమని కోరవచ్చు.
* శృంగారానికి సమయం ఆసన్నమైందనడానికి ఇదో మార్గం.
* ఒకరినొకరు సెక్సీగా అనిపించేలా పరస్పరం ప్రేరేపించుకోనేలా మసాజ్ ఉండాలి.

Too tired and busy for sex these tips to improve your sex life

మీ గదిలో నచ్చి నట్లు… Tv ని చూడండి :
* రాత్రి సమయంలో మీకు నచ్చినట్టుగా  ఉంటూనే కలిసి టీవీ చూడండి.
* కొంచెం సిగ్గుగా అనిపిస్తే.. మాత్రం లో-దుస్తులు ధరించాలి.
* నగ్నంగా కలిసి టీవీ చూస్తూ శృంగార అనుభూతిని ఎంజాయ్ చేయొచ్చు.

READ  హార్ట్ ఎటాక్ వచ్చినా భయపడొద్దు.. శృంగారంతో ఆయుష్షు పెంచుకోవచ్చు : స్టడీ

సెక్సీ గేమ్స్ ఆడండి :
* స్ట్రిప్ పోకర్ ఆడొచ్చు.. శృంగారపు ఆటల్లో ఇదొకటి.
* కింకి స్క్రాబుల్ (మీరే రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు).
* పార్టనర్ శరీరంపై ఒక భాగంలో పూసిన క్రీమ్‌ను లిక్ చేస్తూ ప్రేరణ పొందొచ్చు.

శృంగారంలో ఏం చేయాలో లిస్టు ప్రిపేర్ చేయండి :
* ఇద్దరూ కలిసి శృంగార విషయాల జాబితాను రాసుకోండి.
* ఏది ఎక్కువ సార్లు టిక్ చేస్తే… అది ఎక్కువగా ప్రయత్నించాలి.
* శృంగారానికి ముందు జరిగే ప్రేరణ కోసం ఇలా ప్రయత్నించవచ్చు.

శృంగారానికి కాస్తా దూరంగా ఉండేలా ప్లాన్ చేయండి :
* పిల్లలతో ఆటలాడండి.. వారిని కాసేపు వదిలేసి.. కొంత సమయం కలిసి గడపండి.
* నచ్చిన అంశాలను గుర్తు చేసుకోండి.. ఇరువురిలో ప్రేమను పెంచే విషయాలను ముచ్చటించండి.
* కబర్లు చెప్పుకున్న కొంత సమయం రిలేషన్ స్ట్రాంగ్ చేస్తుంది..
* అంతేగానీ, శృంగారాన్ని ఆశించి దూరంగా వెళ్లే ప్రయత్నం చేయొద్దు.
* ఆశ్వాదించలేని శృంగారం వ్యర్థమే.. ఆ సమయంలో ఒకరినొకరు మాట్లాడుకోవడం చేయాలి.
* దీర్ఘకాలిక సంబంధాలకు ఇరువురి మధ్య సమన్వయం అవసరం..
* అలసటగా లేదా బిజీగా ఉన్నా సమయంలోనూ రిలేషన్ బలపడేలా ప్రయత్నించాలి.
* శృంగారానికి ఒక సమయం ఉందని గుర్తిండాలి.. అదే సమయాన్ని శృంగారానికి ఎంచుకోండి.
* అప్పుడే ప్రతి రాత్రి వసంత రాత్రిలా సంసార జీవితం సుఖమయంగా మారుతుంది..

Related Posts