Tough Cookie Discount For Doctors And Nurses INDIGO

INDIGO ఆఫర్..ఛార్జీలపై 25 శాతం తగ్గింపు..వారికి మాత్రమే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రస్తుతం ప్రపంచంలో కరోనా టైం నడుస్తోంది. లక్షలాది సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే విధంగా కొనసాగుతోంది. రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిపై ప్రశంసలు కురుస్తున్నాయి. వీరి ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు పలు చర్యలు తీసకుంటున్నాయి.

అంతేగాకుండా…ఈ యోధులకు పలు సంస్థలు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. దేశీయ విమానయాన సంస్త INDIGO వైద్య సిబ్బంది బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహమ్మారిని అరికట్టేందుకు..రోగులను బతికేంచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులకు విమాన ఛార్జీలపై 25 శాతం తగ్గింపు ఇస్తామని ఇండియో సంస్థ ప్రకటించింది.

Tough Cookie పేరిట నిర్వహిస్తున్న ప్రచారంలో ఈ తగ్గింపును అందివ్వనున్నట్లు తెలిపింది.  ఇండిగో చెక్-ఇన్ వద్ద కుకీ టిన్, బోర్డింగ్ గేట్ వద్ద స్వాగత ప్రకటన, పీపీఈ కిట్ పై ప్రత్యేక టఫ్ కుకీ స్టిక్కర్ తోపాటు, విమానంలో వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతామని వెల్లడించింది. ఇండిగో వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసేటప్పుడు ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

ఈ ఆఫర్ 2020 ఏడాది చివరి వరకు వర్తింపజేస్తామని, చెక్-ఇన్ సమయంలో వారి గుర్తింపునకు సంబంధించిన ఆసుపత్రి ఐడిలను అందించాల్సి ఉంటుందని తెలిపింది. జూలై 1, 2020 నుండి డిసెంబర్ 31, 2020 టికెట్ల కొనుగోలుకు, ప్రయాణానికి ఈ తగ్గింపు చెల్లుతుందని తెలిపింది. అంతేకాదు వీరి ప్రత్యేకతను ప్రయాణంలో ప్రతి దశలో గుర్తించేలా చేస్తుందని వెల్లడించింది.

Read:ముంబై ఎయిర్ పోర్టు స్కాంలో GVK గ్రూప్‌కు ఎదురుదెబ్బ.. సీబీఐ కేసు!

Related Tags :

Related Posts :