లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

మలయాళీ స్టైల్లో పంచె కట్టుకున్న ఈ కుక్కకు వధువు కావాలెను..!!

Updated On - 1:34 pm, Sat, 23 January 21

traditional malayali dog outfit is looking for a bride : అదొక అందమైన కుక్క. దానికి పెళ్లీడు వచ్చిందట. మంచి అందమైన కుక్కను పెళ్లి చేసుకోవాలనుకుంటోందట. కాబట్టి మీకు ఓ మంచి అందమైన ఆడకుక్క ఉంటే సంప్రదించగలరు..అంటూ మలయాళీ గెటప్ లో పంచె కట్టుకున్న ఓ కుక్క ఇచ్చిన ప్రకటన ఇది.

అదేంటీ కుక్కేంటీ వధువు కావాలని ప్రకటన ఏంటీ? అని షాక్ అవుతున్నారా? అదేనండీ ఆ కుక్కను పెంచుకున్న ఫ్యామిలీ ఇచ్చిన ప్రకటన అన్నమాట..కుక్కలను పెంచుకొనే యజమానులు.. వాటిని ఎప్పుడూ తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారనే విషయం తెలిసిందే. అలా ఓ కుటుంబం ఓ కుక్కకు మలయాళీ గెటప్ లో పట్టు పంచె కట్టి..చక్కగా షర్టు కూడా వేసి అచ్చంగా పెళ్లి కొడుకులా ముస్తాబు చేశారు. దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టి..ఈ హ్యాండ్ సమ్ కుక్కకు ఓ అందమైన వధువు కావాలెను అని ప్రకటించారు…!! ఏంటీ పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో అనుకుంటున్నారా? ఎందుకండీ అదోక సరదా..సోషల్ మీడియా పుణ్యమాని ఈ పెళ్లికొడుకు కుక్క ఫోటో వైరల్ గా మారింది.

ఈ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి..‘‘మీ అందమైన అమ్మాయి కోసం ఎవరైనా హ్యాండ్‌సమ్ మళయాళీ అబ్బాయి కోసం వెతుకుతున్నారా?’’ అనే క్యాప్షన్‌తో ఫొటోను పోస్ట్ చేశారు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ కుక్కకు చక్కగా నాలుగు రకాల కూరలు, పచ్చడి అప్పడంతో సహా మంచి భోజనం వండి ఓ అరిటాకు ముందు కూర్చోపెట్టి మరీ ఫోటో తీశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజనులు కూడా సరదా సరదాగా స్పందించారు. ఇదిగో పెళ్లి కూతురు అంటూ ఆడ కుక్క పిల్లల ఫొటోలు పెడుతున్నారు. ఏది ఏమైనా పట్టు పంచెలో మాత్రం ఈ కుక్క భలే ముద్దుగా ఉందిలే..ఎవరి సరదాలు వాళ్లు తీర్చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో..