traffic challans

బాబోయ్ ట్రాఫిక్ చాలానాలు 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి 80 చలానాలు ఒకే సారి చెల్లించిన వాహనదారుడు

హైదరాబాద్: హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నారా ? రెడ్ సిగ్నల్ పడినా స్టాప్ గీత దాటి ముందుకు వచ్చారా, వన్ వేలో బండి నడిపారా….ఇలా అనేక రకాలైన ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి నన్నేవరూ చూడట్లేదు అనుకుంటూ మీరు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే మీకు తెలియకుండానే మిమ్మల్ని వాచ్ చేసే మూడో నేత్రం మీబండి కి చలానాలు వేస్తుంది. అవి  చాంతాడంత పెరిగితే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడో ఒక చోట మీ బండి ఆపేస్తారు. విశాల్ సింగ్ అనే యువకుడ్ని పోలీసులు అలాగే ఆపేశారు. మొత్తం అతని బండి మీద ఉన్న 80 పెండింగ్ చలానాలు వసూలుచేశారు. 
వివరాల్లోకి వెళితే…ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా బండి నడిపి ఒకే సారి 80 చలాన్లకు పెనాల్టీ కట్టాడు విశాల్ సింగ్. గురువారం రాత్రి సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో వాహానాలను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్  పోలీసులు  విశాల్ సింగ్ వాహనాన్నికూడా ఆపి రికార్డులు చెక్ చేసారు. అతని వెహికల్ పై ఏమైనా పెండింగ్ చలానాలు ఉన్నాయేమోనని చెక్ చేయగా, ట్రాఫిక్ ఎస్సై ఒక్క సారిగా అవాక్కయ్యారు.  విశాల్ సింగ్ బండి పై 80 పెండింగ్ చలానాలు ఉన్నాయి. వాటి విలువ 12,630 రూపాయలు.  పోలీసులు వెంటనే ఆమొత్తాన్ని చెల్లించాలని కోరటంతో విశాల్ సమీపంలోని ఈ సేవా  కేంద్రానికి వెళ్ళి  ఆ మొత్తం చెల్లించి బండి విడిపించుకు వెళ్లాడు.  

Related Posts